Home /News /politics /

Konijeti Rosaiah: తెలంగాణలో మూడు రోజుల పాటు సంతాప దినాలు.. సీఎం కేసీఆర్ నివాళి

Konijeti Rosaiah: తెలంగాణలో మూడు రోజుల పాటు సంతాప దినాలు.. సీఎం కేసీఆర్ నివాళి

మూడు రోజుల సంతాప దినాలు

మూడు రోజుల సంతాప దినాలు

Konijeti Rosaiah: పదవులకు వన్నె తెచ్చిన రాజకీయ నేత రోశయ్య.. అందుకే పార్టీలకు అతీతంగా అంత గుర్తింపు తెచ్చుకున్నారు. పదవి ఏదైనా.. తనదైన శైలిలో వాటాకి హుందాతనం తెచ్చారు. అందుకే ఆయన అందరివాడయ్యారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్.. మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు..

ఇంకా చదవండి ...
  Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య (Konijeti Rosiaiah) పార్థివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ (Telagna cm kcr) నివాళులర్పించారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని.. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 4,5,6 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం.. రోశయ్య అంత్యక్రియలను కొంపల్లిలోని తమ ఫాం హౌంస్ లో నిర్వహిస్తామని.. చెప్పారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియులు ఏర్పాటు చేస్తామన్నారు. సరేన్న సీఎం కేసీఆర్.. ఆ కుంటు సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు. మరోవైపు రోశయ్య మరణంపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ తరుపున ఆ కుటుంబానిక ఎలాంటి అవసరం ఉన్నా సాయపడాల్సిన నేతలను కోరారు. మరోవైపు ఆయన అంత్యక్రియలకు ముందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్భన కోసం కాసేపు గాంధీభవన్ (Gandhi  bhavan) లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు.

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణాన్ని ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. 88 ఏళ్ల రోశయ్యకు ఉదయం ఒక్కసారిగా బీపీ పడిపోయింది. దీంతో వెంటనే ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఆయన ఇంటి నుంచి స్టార్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌ స్టార్‌ ఆసుపత్రి నుంచి రోశయ్య నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న రోశయ్యను.. ఎన్నో పదవులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

  ఇదీ చదవండి: బీ అలర్డ్.. గంటకు 100కి.మీ వేగంతో గాలులు.. ఎగసిపడుతున్న రాకసి అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

  కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు.. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు చేపట్టారు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు నిర్వర్తించారు. 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు.

  ఇదీ చదవండి: రాజకీయాల్లో అందరివాడు.. నేతలతో రోశయ్య అరుదైన ఫొటోలు

  1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మరోసారి శాసన మండలికి ఎంపికయ్యారు. వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనూ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణంపై ప్రముఖుల సంతాపం వెల్లువెత్తుతోంది.

  ఇదీ చదవండి: ఏజెన్సీలో చేతబడి కలకలం.. అనుమానంతో దాడి.. ముగ్గురు మృతి

  తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. రాజకీయాల్లో రోశయ్య తనదైన శైలిని ప్రదర్శించేవారని పేర్కొన్నారు. పలు పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఆయన మృతి చాలా బాధాకరమని సీఎం అన్నారు.

  ఇదీ చదవండి: వామ్మో నాటు సారా చెరువు.. పోలీసులకు సవాల్ విసురుతున్న గ్యాంగ్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2010 నవంబరు 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, CM KCR, Rosaiah

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు