Home /News /politics /

TELANGANA CM KCR NEW STRATEGY TO TARGET BJP AND MAY GO FOR EARLY POLLS WITH A PREPLANNED AGENDA AK

Telangana: కేసీఆర్ అలాంటి పరిస్థితి తీసుకొస్తారా ?.. అదే అజెండాతో ముందుకు వెళతారా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: తాజాగా తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ అదే రకమైన వ్యూహాలతో బీజేపీని ఎదుర్కొంటారేమో అనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

    తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇక్కడ ఇప్పటికప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధం కారణంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ రాజకీయంగా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. తమకు అందివచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవద్దనే పట్టుదలతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు సాద్యమైనంత తొందరగా కళ్లెం వేయాలనే ఆలోచనలో కేసీఆర్ కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా తమ వ్యూహాలను అమలు చేస్తుండటంతో.. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

    అయితే రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న సీఎం కేసీఆర్.. మరోసారి తెలంగాణలో అధికార సొంతం చేసుకునేందుకు ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్..ఆ పరిస్థితిని తెలంగాణలో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారా ? అనే చర్చ మొదలైంది. నిజానికి తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే.. గతంలో మాదిరి కాకుండా ఈసారి బలమైన కారణం చూపించాల్సి ఉంటుందనే భావనలో ఉన్నారట కేసీఆర్.

    అందుకే దేశ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నానని.. అందుకే ముందుగా తెలంగాణలోఎన్నికలకు వెళుతున్నాననే వాదనను ఆయన తెరపైకి తీసుకొస్తారనే వాదన జరుగుతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మద్యే ఉంటుందని.. అదే జరిగితే కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. బెంగాల్‌లో బీజేపీని ఢీ కొట్టేందుకు లోకల్ సెంటిమెంట్‌ను మమత బెనర్జీ బలంగా వినియోగించుకున్నారు. దీనికి తోడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఆమెకు కలిసొచ్చాయి.

    Telangana: టార్గెట్ బీజేపీ.. కేసీఆర్ ఆశలన్నీ ఆ రాష్ట్రం మీదే ఉన్నాయా ?

    Revanth Reddy: తగ్గేదేలే అని డిసైడయిన రేవంత్ రెడ్డి.. వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదా ?

    తాజాగా తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ అదే రకమైన వ్యూహాలతో బీజేపీని ఎదుర్కొంటారేమో అనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పూర్తిస్థాయిలో బలపడకముందే ఎన్నికలు వెళ్లాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని.. అదే జరిగితే ఆయన ఏ అజెండాతో మళ్లీ ఎన్నికలు వెళతారన్నది ఇప్పటికప్పుడు చెప్పడం కష్టమే అవుతుందని పలువురు భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు