Home /News /politics /

TELANGANA CM KCR NEW PLAN TO IGNORE BJP MLA VOICE IN ASSEMBLY AK

Telangana Politics: బీజేపీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇచ్చిన కేసీఆర్.. అసలు కారణం ఇదేనా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR BJP MLAs: టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం సంచలనం సృష్టించింది.

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇచ్చింది ప్రభుత్వం. సభలో గందరగోళం సృష్టిస్తున్నారనే కారణంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నుంచి బీజేపీకి (Bjp)  చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లను సస్పెండ్ చేసింది. ఈ సెషన్ మొత్తం ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే అసెంబ్లీలో ఈ రకమైన పరిణామం తమకు ఎదురవుతుందని బీజేపీ ఊహించలేదు. సాధారణంగా సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడమనేది కఠిన నిర్ణయమే. సభ్యులు సభను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తే.. పదే పదే సభకు అడ్డుతగిలితే ఇలాంటివి చేస్తుంటారు.

    కానీ సోమవారం బీజేపీ సభ్యులు ఆ స్థాయిలో సభలో గందరగోళం సృష్టించిన పరిస్థితులు కూడా లేవనే చెప్పాలి. కానీ వారి ఆందోళనపై ప్రభుత్వం ఊహించని విధంగా సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం.. దాన్ని స్పీకర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహం దాగి ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana)  అసెంబ్లీలో టీఆర్ఎస్‌ను ప్రశ్నించే విషయంలో కాంగ్రెస్ (Congress) కంటే బీజేపీ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.

    దీనికి తోడు ఆ పార్టీ తరపున గెలిచిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వంటి నేతలకు మంచి వాగ్దాటి కూడా ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చాతుర్యం కూడా వారి సొంతం. అందుకే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ వీరి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. వారి ఆందోళనను కారణంగా చూపించి వారిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిందనే చర్చ జరుగుతోంది.

    Telangana Politics: ఆ పదవుల విషయంలో కేసీఆర్ ఆలోచన ఏంటి ?.. నేతల ఎదురుచూపులు ?

    TS Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో మార్చి 10 టెన్షన్.. మళ్లీ రచ్చ మొదలవుతుందా ?

    నిజానికి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం సంచలనం సృష్టించింది. ఆయన అసెంబ్లీలో అధికార పార్టీని టార్గెట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇందుకు ఉన్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఆయన వాయిస్ వినిపించే అవకాశం లేకుండా కేసీఆర్ ఈ రకంగా ఎత్తుగడ వేసి ఉంటారనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి కారణం ఏదైనా.. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు సిద్ధమైన బీజేపీకి సీఎం కేసీఆర్ ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు