KCR Meets Tamilisai: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైను కలిసిన సీఎం కేసీఆర్

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌, సీఎం కేసీఆర్ (File)

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. సెప్టెంబర్ 7 నుంచి 20 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గత బడ్జెట్ సమావేశాలను కరోనా వైరస్ వల్ల అర్ధాంతరంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చర్చకు రానీ బిల్లులు, ఆమోదం పొందని బిల్లులు ఈసారి సభలో ప్రవేశపెడతారు. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహిస్తారు. సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి గవర్నర్ తమిళిసైకి తెలియజేశారు సీఎం కేసీఆర్. అలాగే, మాజీ ప్రధాని పీవి నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవి జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన పలువురి ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో చాలా మంది వైరస్ నుంచి కోలుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ కూడా క్యూర్ అయ్యారు. ఇటీవలే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కరోనా బారిన పడ్డారు. కరోనా తగ్గితేనే ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 28న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బాబాయ్, తమిళనాడు కాంగ్రెస్ నేత, కన్యాకుమారి ఎంపీ అయిన వసంతకుమార్ కరోనాతో కన్నుమూశారు. ఈ క్రమంలో కేసీఆర్ మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసి పరామర్శించినట్టు తెలిసింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద కూడా గవర్నర్‌కు ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ వివరాలు అందించారు.

    తెలంగాణలో కొత్తగా 2751 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య లక్షా 20వేల 166కి చేరింది. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 9 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 808కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.67 శాతంగా ఉంది. దేశంలో అది 1.81 శాతంగా ఉంది. తెలంగాణలో నిన్న 1675 మంది రికవరీ అయ్యారు. అందువల్ల మొత్తం రికవరీల సంఖ్య 89350కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 74.3 శాతంగా ఉంది. దేశంలో అది 76.49 శాతంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 30008 ఉన్నాయి. వీటిలో 23049 కేసుల్లో పేషెంట్లు ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. తెలంగాణలో నిన్న 62300 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 1266643కి చేరింది. 1010 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో సాధారణ బెడ్లు 11534 ఖాళీగా ఉన్నాయి. 750 నిండి ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్లు 4592 ఖాళీగా ఉన్నాయి. 1269 నిండి ఉన్నాయి. ఐసీయూ బెడ్లు 1602 ఖాళీగా ఉండగా... 649 నిండివున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: