Home /News /politics /

TELANGANA CM KCR MEETS CM STALIN IN TAMILNADU VRY

cm kcr meets Stalin : సీఎం స్టాలిన్‌తో సమావేశం అయిన కేసీఆర్.. కూటమి.. సాధ్యమయ్యేనా..?

cm kcr meets Stalin : ముఖ్యమంత్రి కేసిఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. కాసేపటి క్రితం మంత్రి కేటిఆర్‌తో పాటు కుటుంబసభ్యులతో కలిసి సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు.

    తమిళనాడులో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటి, రాజకీయా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై సీఎం కేసిఆర్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కేంద్ర విధానాలపై ఆయన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని రైతులు, వ్యవసాయ అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలోనే ఇద్దరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా దేశంలో బీజేపీని వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు సీఎం కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్‌తో కేసిఆర్ భేటి అయినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కుటుంబ సమేతంగా తమిళనాడులోని శ్రీరంగం ఆలయాన్ని సందర్శించుకున్న సీఎం నేడు నేరుగా రాజకీయా కార్యచరణకు శ్రీకారం చుట్టారు.

    మరోవైపు బీజేపిని గద్దె దించేవరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని రాష్ట్ర టీఆర్ఎస్ నేతలు అధికారికంగానే ప్రకటించారు. ఇందుకోసం బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న పార్టీలను సీఎం కేసిఆర్ కలుస్తారని స్పష్టం చేశారు. కాగా సీఎం కేసిర్ 2018 తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇతర ఫ్రంట్‌లు ఏర్పాటు కావడం అవసరమని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పలువురు ఇతర పార్టీల నేతలతో కూడా ఆయన సమావేశం అయ్యారు. కాని ఆ ఫ్రంట్ మాత్రం రూపుదిద్దుకోలేదు. దీంతో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరింత బలాన్ని పుంజుకుని పూర్తిస్థాయి మెజారిటిని ఆ పార్టీ సాధించింది.

    Gangula kamalakar : బాధ్యత బండి సంజయ్ తీసుకుంటారా.. లేక ఈటలనా...?

    అయితే ప్రస్తుతం మరో రెండు సంవత్సరాలే ఎన్నికలు ఉండడంతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం ఉండడం తో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దీంతోపాటు తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతుందంటూ టీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తుండగా మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం మరో ఫ్రంట్ ‌కు తానే ప్రత్యామ్నాయం అంటూ పావులు కదుపుతోంది. దీంతో రాజకీయంగా ఎలాంటీ పరిణామాలు వీరిద్దరి భేటి తర్వాత మారతాయనేది వేచి చూడాలి.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, MK Stalin

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు