ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మౌనం వీడేది ఆ రోజే..!

సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మళ్లీ ఎప్పుడు పెదవి విప్పుతారు? అని అందరిలోనూ ఉత్కంఠ. అయితే.. త్వరలోనే పెదవి విప్పుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి వేదిక హుజూర్‌ నగర్ నియోజకవర్గమేనని చెబుతున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 14, 2019, 1:01 PM IST
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మౌనం వీడేది ఆ రోజే..!
సీఎం కేసీఆర్ (FIle)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 14, 2019, 1:01 PM IST
ఆర్టీసీ సమ్మెతో యావత్తు తెలంగాణ ఇబ్బంది పడుతోంది. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మికులు ఒకవైపు.. అస్సలు తగ్గేది లేదని సీఎం కేసీఆర్ మరోవైపు.. ఇలా సమ్మె పదో రోజుకు చేరింది. బస్సులు నడవకపోవడంతో విద్యార్థులకు సెలవులు కూడా పొడిగించారు సీఎం కేసీఆర్. కార్మికులతో చర్చలు జరిపే ప్రస్తకే లేదని తేల్చి చెప్పిన ఆయన.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా తీవ్ర కసరత్తు చేశారు. అయితే, ఈ క్రమంలో కార్మికుల ఆత్మహత్యలు కాస్త సీఎంను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన ఏదో ప్రకటన చేయాలని అటు కార్మికులు, ఇటు ప్రజలు, మేధావులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని విన్నవిస్తున్నారు. సీఎం మళ్లీ ఎప్పుడు పెదవి విప్పుతారు? అని అందరిలోనూ ఉత్కంఠ. అయితే.. త్వరలోనే పెదవి విప్పుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి వేదిక హుజూర్‌ నగర్ నియోజకవర్గమేనని చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా 19వ తేదీన ప్రచారం ముగియనుంది.

ఆలోపే, అంటే.. 18వ తేదీన టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఆ సభలో సీఎం ఆర్టీసీ సమ్మెపై మాట్లాడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సమ్మె వల్ల ఓటర్లలో కాస్త అసహనం నెలకొంది. అది టీఆర్‌ఎస్ పార్టీకి చేటు చేసేలా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టు సీఎం చేతికి అందినట్లు సమాచారం. అందువల్ల.. ఆ అసహనాన్ని తగ్గించి, గులాబీ వైపు ఓటర్లను ఆకర్షించేలా ఆ రోజే ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉండగా, హుజూర్ నగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ 21న, 24వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి ప్రధాన పోటీదారులుగా బరిలో దిగుతున్నారు.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...