కల్వకుంట్ల కవితకు కేసీఆర్ భారీ షాక్...?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఏప్రిల్‌లో ఖాళీ అవుతాయి. వాటికి సంబంధించిన ఎన్నికలు మార్చిలో జరుగుతాయి.

news18-telugu
Updated: February 27, 2020, 7:27 PM IST
కల్వకుంట్ల కవితకు కేసీఆర్ భారీ షాక్...?
కేసీఆర్, కవిత (ఫైల్ ఫోటో)
  • Share this:
సొంత కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ అయిన కల్వకుంట్ల కవితకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ షాక్ ఇస్తున్నట్టు తెలిసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన ఆమెను రాజ్యసభకు పంపుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆమె పేరును కేసీఆర్ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం... ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికలు అన్నిటిలోనూ కారు పార్టీ జోరుకొనసాగింది. ఆయా ఎన్నికల్లో నేతలు అందరికీ సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎవరి ఇలాకాలో పార్టీ ఓడితే వారి పదవులు ఊడతాయనే భయాన్ని కల్పించారు. దీంతో పార్టీ నేతలు కష్టపడి టీఆర్ఎస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు నిజామాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను తీసుకుని వెళ్లి రాజ్యసభకు పంపితే... ప్రత్యక్ష ఎన్నికల్లో కూతుర్ని గెలిపించుకోలేక అడ్డదారిలో రాజ్యసభకు పంపారనే నింద తన మీద పడుతుందని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇతర పార్టీల నేతలుకానీ, సొంత పార్టీ నేతలు కూడా ఆ మాట అనే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కవిత పేరును పక్కన పెట్టినట్టు సమాచారం.

కేటీఆర్‌పై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్... మరి కవిత సంగతేంటి ? | Suspense over Cm kcr decision on his daughter kavitha political future ak
కేటీఆర్, కవిత ( ట్విట్టర్ ఫోటో )


2019 మే‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నెలల వరకు కవిత బయట పెద్దగా కనిపించలేదు. బతుకమ్మ సంబరాల్లో కూడా ఆమె బయటకు రాలేదు. ఓటమి భారంతో ఉన్నారని అప్పుడు అంతా అనుకున్నారు. కానీ, మధ్యలో కొన్ని రోజులు మాత్రం యాక్టివ్‌గా కనిపించారు. దీంతో ఆమెను రాజ్యసభకు పంపుతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. కానీ, మళ్లీ కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత పెద్దగా కనిపించడం లేదు. వినిపించడం లేదు. రాజ్యసభకు పంపడం లేదని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడం వల్లే ఆమె మళ్లీ తెరమరుగు అయ్యారనే వాదన టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.

కేసీఆర్‌కు తిలకం దిద్దుతున్న కవిత..
కేసీఆర్‌కు తిలకం దిద్దుతున్న కవిత.. (File)
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఏప్రిల్‌లో ఖాళీ అవుతాయి. వాటికి సంబంధించిన ఎన్నికలు మార్చిలో జరుగుతాయి. ఆ రెండు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోనే పడటం ఖాయం. ఒకవేళ కవితను రాజ్యసభకు పంపకపోతే పెద్దల సభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరనే చర్చ టీఆర్ఎస్‌లో జరుగుతోంది. ఒక సీటు మాత్రం ఎస్సీ లేదా ఎస్టీలకు దక్కే అవకాశం ఉంది.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు