కేసీఆర్ సీఎం పదవిని వదులుకోనున్నారా.. కారణం అదే..?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: February 19, 2020, 7:58 AM IST
కేసీఆర్ సీఎం పదవిని వదులుకోనున్నారా.. కారణం అదే..?
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ పని చేసినా సంచలనమే.. రిస్క్ తీసుకోవడం, ఆ రిస్క్ నుంచి కిక్ వెతుక్కోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమ కాలం నుంచే దూకుడుగా వ్యవహరిస్తూ, సందర్భానుసారం అణుకువగా ఉంటూ ఉద్యమాన్ని సక్సెస్ చేశారు. పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసినా, ఇతరులు చేయలేనిదాన్ని సుసాధ్యం చేసినా, ముందస్తు ఎన్నికలకు వెళ్లి సాహసం చేసినా, ఉప ఎన్నిక ముందు ఆర్టీసీ కార్మికులకు మొట్టికాయలు వేసినా ఆయనకే చెల్లింది. తాను చేసే పని మీద పూర్తి క్లారిటీ, విశ్వాసం ఉన్న కేసీఆర్.. ఒక పని మొదలు పెట్టారంటే చేసే దాకా వదిలి పెట్టరు. ఆయన జగమొండి అని ఒక్క మాటలో అనేస్తారు రాజకీయ విశ్లేషకులు. అందుకే కేసీఆర్‌కు దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక.. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీకి దీటుగా ఫెడరల్ ఫ్రంట్ అన్న మాటతో ఢిల్లీ పెద్దల్లో గుబులు పుట్టించారు కూడా. కొన్ని కారణాలతో ఆ దిశగా ఆయన ఎక్కువ దృష్టి పెట్టలేదు.

అయితే, ఇదే సరైన సమయంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాలు కేసీఆర్‌కు కొత్త కాకపోయినా.. బీజేపీ అధికారం చేపట్టాక సమీకరణాలు మారాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తెలంగాణ సీఎం.. మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పుతారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. కేటీఆర్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి.. దేశవ్యాప్తంగా తనకున్న పలుకుబడితో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ముందుకు సాగే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయ రాజకీయాల్లో ఉండాలంటే ఎంపీగా పదవి ఉంటే బెటర్ అని, అందుకే ఎంపీగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు తనకు అచ్చొచ్చిన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ నిర్ణయంతో బీజేపీకి కూడా చెక్ పెట్టవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు