• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA CM KCR MAY FIELD EX MP VINOD IN HUZURABAD BY ELECTIONS TO TARGET EX MINISTER ETELA RAJENDAR AK

Telangana: ఈటలపై పోటీ చేయబోయేది ఎవరు.. కేసీఆర్ మదిలో కీలక నేత ?

Telangana: ఈటలపై పోటీ చేయబోయేది ఎవరు.. కేసీఆర్ మదిలో కీలక నేత ?

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Telangana: హుజూరాబాద్‌ను మళ్లీ టీఆర్ఎస్‌ కైవసం చేసుకోవడం ఎలా అనే అంశంపై గులాబీ బాస్ బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేశారనే చర్చ జరుగుతోంది.

  • Share this:
    ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్... ఆ పార్టీకి దూరం కావడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి. పదే పదే ఆత్మగౌరవం ప్రస్తావన తీసుకొస్తున్న ఈటల రాజేందర్.. పరిస్థితిని బట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్ విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందే ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో ఎన్నికల జరగడం ఖాయమనే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్.. అక్కడ ఈటల రాజేందర్‌పై బలమైన టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధించడంపై ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో చాలా ముందస్తుగానే ఆలోచించిన గులాబీ బాస్ కేసీఆర్... హుజూరాబాద్‌ను మళ్లీ టీఆర్ఎస్‌ కైవసం చేసుకోవడం ఎలా అనే అంశంపై బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేశారనే చర్చ జరుగుతోంది.

    ఇందులో భాగంగా ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ తరపున అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనే దానిపై కూడా సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో సాగుతోంది. హుజూరాబాద్‌లో నాలుగుసార్లు గెలిచిన ఈటల రాజేందర్‌‌ను సొంతం నియోజకవర్గంలో ఓడించడం అంత ఈజీ కాదని.. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి కూడా బలమైన నాయకుడే అయి ఉండాలని కేసీఆర్ ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం.

    ఈ కారణంగానే ఉప ఎన్నికలు జరిగితే.. హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను బరిలోకి దింపాలనే ఆలోచనతో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించానని పదే పదే చెబుతున్న ఈటల రాజేందర్‌ను ఢీ కొట్టేందుకు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వినోద్ కుమార్‌ను బరిలో దించడమే సరైందని కేసీఆర్ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

    అయితే ఓ బీసీ నాయకుడిని పార్టీ నుంచి తొలగించి కేసీఆర్ తన సొంత సామాజికవర్గానికి చెందిన నేతను పోటీ పెట్టారనే ప్రచారం జరగొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లాకు ఎంపీగా వ్యవహరించిన వినోద్‌.. హుజూరాబాద్‌లో ప్రభావం చూపిస్తారని టీఆర్ఎస్ నాయకత్వం నమ్ముతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో కేసీఆర్ మదిలో వినోద్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉందని.. అయితే ఎన్నిక జరిగే నాటికి పరిస్థితులు మారితే మరో నాయకుడిని పోటీలో దింపే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు