తెలంగాణ కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తోందా ?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టే సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ముందే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: August 21, 2019, 1:03 PM IST
తెలంగాణ కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తోందా ?
కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్
  • Share this:
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు రాజకీయవర్గాల్లో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నా... అసలు ఈ విషయంలో కేసీఆర్ మనసులో ఏముందనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లోకి కొత్తగా మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ ఎప్పుడెప్పుడు తన కేబినెట్‌ను విస్తరిస్తారా ? తమకు అందులో చోటు దక్కుతుందా ? అని పలువురు ఎదురుచూస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల తరువాతే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టే కేసీఆర్ కేబినెట్ బెర్త్‌లను ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ముందే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓ సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు తీసుకోవాలని కోరారు. పలువురు మంత్రులు సైతం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ బాగా అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ మళ్లీ మంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఒక్క కేటీఆర్‌ను మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదు కాబట్టి... త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని... ఈ విస్తరణలో మరో మాజీమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావును కూడా కేసీఆర్ మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్... ఈలోపే మంత్రివర్గ విస్తరణ చేపడతారా లేక మళ్లీ విస్తరణను పెండింగ్‌లో పెడతారా అన్నది చూడాలి.First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>