ఎమ్మెల్యేలకు భారీ గిఫ్ట్... బడ్జెట్‌లో ప్రకటించనున్న సీఎం కేసీఆర్...

నియోజకవర్గ అభివృద్ది పథకం కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.

news18-telugu
Updated: February 22, 2020, 9:50 PM IST
ఎమ్మెల్యేలకు భారీ గిఫ్ట్... బడ్జెట్‌లో ప్రకటించనున్న సీఎం కేసీఆర్...
కేసీఆర్
  • Share this:
తెలంగాణాలో మరో పదిహేను రోజుల్లో కొత్త బడ్జెట్ రాబోతోంది.ఈ బడ్జెట్లో ప్రజలకు శుభవార్త ఉంటుందో లేదో తెలియదు. కానీ,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శుభవార్త ఉండబోతోందని తెలిసింది. ఎమ్మెల్యే లకు ఏం తక్కువైంది? ఇంకా ఏం శుభవార్త అని అనుకుంటున్నారా? మార్చి మొదటి వారంలో తెలంగాణలో కొత్త బడ్జెట్ రాబోతోంది. దీని కోసం ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కు ఖుషి కబురు చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Telangana lok sabha election results 2019, lok sabha election results 2019, trs, congress, bjp, telangana, kcr, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019, లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2019, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ, కేసీఆర్
కేేసీఆర్ (File)


ఉమ్మడి రాష్ట్రం నుంచి ‘నియోజకవర్గ అభివృద్ధి పథకం’ కొనసాగుతోంది. ఈ పథకం కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతి ఏటా కొన్ని నిధులు కేటాయిస్తారు. ఈ నిధులను తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం సొంతంగా కేటాయించే హక్కు ఉంటుంది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి దఫాలో నాలుగేళ్ల పాటు ఈ పథకం కొనసాగింది. సీడీఎఫ్ పథకం రద్దు అయ్యే నాటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏటా రూ.1.5 కోట్లు నిధులు కేటాయించేవారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో సీడీఎఫ్ పథకాన్ని రద్దు చేశారు.

telangana assembly, telangana cabinet, telangana cm kcr, kcr fires on congress, తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణ కేబినెట్, తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్‌కు కేసీఆర్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్న కేసీఆర్ (File)
ఆర్థిక మాంద్యం కారణంగా తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది తెలంగాణా ప్రభుత్వం. దీంతో ఇప్పట్లో నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం ఉండదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావించారు. అయితే ఈ బడ్జెట్లో నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనలో ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏటా కోటిన్నర చొప్పున నిధులు కేటాయించనున్నట్టు సమాచారం.
First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు