Home /News /politics /

TELANGANA CM KCR LBNAGAR PUBLIC RALLY WE WILL SUPPLY 24 HRS FREE WATER TO HYDERABAD PEOPLE SK

CM KCR: హైదరాబాద్‌లో 24 గంటలు ఉచిత మంచి నీరు.. సీఎం కేసీఆర్ కానుక

ఎల్బీనగర్ సభలో సీఎం కేసీఆర్

ఎల్బీనగర్ సభలో సీఎం కేసీఆర్

GHMC Elections: హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు మరోసారి ఉచిత మంచి నీటి హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి నెలకు 20వేల లీటర్ల ఉచిత నీటిని అందిస్తామని.. రాబోయే రోజుల్లో 24 గంటలూ మంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.

    గ్రేటర్ హైదరాబాద్‌ (GHMC)లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. రేపు సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) ఫైనల్ టచ్ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల నుంచి లక్షా 50 వేల మందికిగా పైగా ప్రజలు తరలి వచ్చారు. ఈ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు మరోసారి ఉచిత మంచి నీటి హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి నెలకు 20వేల లీటర్ల ఉచిత నీటిని అందిస్తామని.. రాబోయే రోజుల్లో 24 గంటలూ మంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

    కేసీఆర్ ప్రసంగం:

    ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. నేతలు ఎలా పనిచేస్తున్నారు? ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు? వారి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. మంచి నాయకులు వస్తారు.

    రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధిపై దృష్టిసారించాం. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పరిణతిని ప్రభుత్వం ప్రదర్శించింది. సోదర సౌభ్రాతృత్వం పెంపొందించింది. కుల,మత, జాతి భేదాలు లేకుండా ముందుకెళ్లింది.

    తెలంగాణలో ఉన్న వారందరూ మా బిడ్డలే. భారత్ నుంచి ఏ మూల నుంచి వచ్చినా.. హైదారబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డ కూడా మా బిడ్డే అని చాలాసార్లు చెప్పాం. గత ఏడేళ్లలో అలానా పరిపాలించాం.

    ఏడెనిమిది నెలల్లోనే కరెంటు సమస్యలను అధిగమించాం. కృషి, పట్టుదలతో ఎంతో శ్రమించి వెలుగు జిలుగుల తెలంగాణను సాధించాం. ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.

    భారత దేశ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణే నెంబర్. ఇది కేంద్ర ప్రభుత్వమే ఈ గణాంకాలను వెల్లడించింది. దీని వెనక ఎంత తపన, కృషి దాగుంది.

    టీఆర్ఎస్ ఎప్పుడూ పక్షపాత నిర్ణయాలు చేయలేదు. మన నిర్ణయాలు చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. మిషన్ భగీరథను ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్లి ఇంటింటికి నీళ్లు అందించాం. నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు వేయొద్దని చెప్పిన మగతనం కలిగిన పార్టీ టీఆర్ఎస్. నీళ్లు పంచాయితీలు ఎక్కడా లేవు.

    హైదరాబాద్ ప్రజలకు 24 గంటల మంచి నీరు అందించడం నా కల. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా అధ్యయనం చేశాం. నాగపూర్, ఢిల్లీకి వెళ్లి మేయర్లు, కార్పొరేటర్లు స్టడీ చేశారు. రాబోయే కొద్ది నెలలు, సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 24 గంటలు మంచి నీటిని సరఫరా చేస్తాం.

    ఇటీవలే ఒక హామీ ఇచ్చాం. నగర ప్రజలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా మంచి నీరును అందిస్తాం. ఢిల్లీ తప్పా ఎక్కడా ఇలాంటి పథకం లేదు. ఇది కేసీఆర్ కానుక. దీని వల్ల నగరంలో 98శాతం ప్రజలకు మేలు చేకూరుతుంది. అపార్ట్‌మెంట్‌లో ఉండే వారికి కూడా ఇది వర్తిస్తుంది.

    దోబీ ఘాట్‌లు, నాయి బ్రాహ్మణులకు కూడా ఉచితంగా కరెంట్ అందిస్తాం. వీరంతా గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇకపై అలాంటివి ఉండవు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, GHMC, Hyderabad - GHMC Elections 2020, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు