కటాఫ్.. రైతు బంధుపై కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్..?

KCR Rythu Bandhu : పథకాన్ని పున:సమీక్షించాలని భావిస్తున్న సీఎం.. రైతు బంధు సాయానికి కటాఫ్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

news18-telugu
Updated: November 22, 2019, 8:55 AM IST
కటాఫ్.. రైతు బంధుపై కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్..?
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకు అమలుచేసినట్టుగా కాకుండా పథకం అమలులో కొన్ని కొత్త నిబంధనలను చేర్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పథకాన్ని పున:సమీక్షించాలని భావిస్తున్న సీఎం.. రైతు బంధు సాయానికి కటాఫ్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదివరకు ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు సాయం అందించిన ప్రభుత్వం.. ఇకనుంచి 10 ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అందించే ఆలోచనలో ఉన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రబీ సీజన్ నుంచి దీన్ని అమలుచేసే అవకాశం ఉందంటున్నాయి.

కాగా,గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఆ ఏడాదిలో రెండు దఫాలుగా రూ.8వేలు ఎకరానికి పెట్టుబడి సాయం అందించారు. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఈ పథకం కీలకమైంది. అయితే అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకానికి నిధులు విడుదల చేయలేదు. దీంతో ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ఖరీఫ్ పాత బకాయిలతో పాటు వచ్చే రబీన్ సీజన్‌కు చెల్లించాల్సిన డబ్బులు సమకూరడం లేదు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి సాయానికి కటాఫ్ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
Published by: Srinivas Mittapalli
First published: November 22, 2019, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading