సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ నుంచి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిపించి కేసీఆర్.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను కౌంటర్ చేస్తూ.. తెలంగాణ హక్కులను స్పష్టం చేస్తూ క్లియర్‌గా ఓ స్ట్రాంగ్ కౌంటర్ అఫిడవిట్ సిద్ధం చేయాలని సూచించనున్నారు. కొన్ని రోజుల్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో కేసీఆర్ హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పలు సూచనలు కూడా చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇలాంటి సమయంలో అసలు కాళేశ్వరం చట్టవిరుద్ధంగా కడుతున్నారని, దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు నష్టాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాలమూరు - రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, తుపాకులగూడెం వంటి ప్రాజెక్టుల మీద ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. గోదావరి జలాల్లో ఏపీ వాటా నీటిని కూడా తెలంగాణ వాడుకుంటోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు శిలాపలకం దగ్గర కేసీఆర్, జగన్
ఈ ఏడాది జూన్ నెలలో కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఆ తర్వాత కాలంలో ఆంధ్ర, తెలంగాణ కలపి ఉమ్మడి ప్రాజెక్టులను కట్టాలని కేసీఆర్, జగన్ అనుకున్నారు. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ, ఇప్పుడు సడన్‌గా కాళేశ్వరం మీద ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.