TELANGANA CM KCR IGNORED L RAMANA AND PEDDIREDDY IN MLC CANDIDATES SELECTIONS AK KNR
Karimnagar: మాజీ సహచరులకు హ్యాండ్ ఇచ్చిన KCR.. వారి పరిస్థితేంటి ?
ఎల్. రమణ, పెద్దిరెడ్డి (ఫైల్ ఫోటో)
Telangana: నిజానికి ఆదివారం వరకు ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఇస్తారని అంతా అనుకున్నారు. కేసీఆర్ పరిశీలిస్తున్న పేర్ల జాబితాలో రమణ పేరు కూడా ఉందని మీడియాలో వార్తలు రావడంతో.. బీసీ నాయకుడి కోటాలో ఆయనకు ఛాన్స్ దక్కుతుందని అనుచరులు భావించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు నాలుగు స్థానాలు దక్కుతాయనుకున్న అంచనా మాత్రం నిజమైంది. ఎమ్మెల్యే కోటాలో రెండు, స్థానిక సంస్థ కోటాలో మరో రెండు.. మొత్తం నాలుగు స్థానాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులకు దక్కుతాయని అంతా అనుకున్నారు. ఆ సంఖ్య అలాగే ఉన్నా.. మాజీమంత్రులు ఎల్. రమణ, పెద్దిరెడ్డికి జాబితాలో అవకాశం రాకపోవడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఎల్.రమణ, పెద్ది రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలో ఉన్న రమణ, బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి... కేసీఆర్ సమక్షంలో కారెక్కారు. వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని.. వారి సేవలను తగిన రీతిలో ఉపయోగించుకుంటామని కేసీఆర్ అన్నారు. దీంతో వారికి ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు.
జిల్లా నుంచి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం ఆ అదృష్టం వరించింది . పార్టీ ఆదేశాలతో కౌశిక్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నిజానికి ఆదివారం వరకు ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఇస్తారని అంతా అనుకున్నారు. కేసీఆర్ పరిశీలిస్తున్న పేర్ల జాబితాలో రమణ పేరు కూడా ఉందని మీడియాలో వార్తలు రావడంతో.. బీసీ నాయకుడి కోటాలో ఆయనకు ఛాన్స్ దక్కుతుందని అనుచరులు భావించారు. కానీ పార్టీ నిర్ణయంతో ఆయన వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
ఈ నేపథ్యంలో ఎల్.రమణకు ఏం పదవి ఇస్తారన్న ఉత్కంఠ మళ్లీ మొదలైంది అదే సమయంలో ఆయనకు టీఎస్సీవో (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) చైర్మన్గా అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా ప్రారంభమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్. రమణ హుజూరాబాద్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. ఆయనను హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో దించుతారన్న ప్రచారం కూడా సాగింది.
కానీ కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించడంతో.. రమణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఈటల బీజేపీలో చేరడంతో అలిగి కమలం పార్టీ నుంచి బయటికొచ్చేసిన సీనియర్ నేత పెద్దిరెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తారని ఆశించారు. పెద్దిరెడ్డి ఉప ఎన్నికలో బాగానే కీలకంగా పనిచేశారు. అయినా ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ రాలేదు. ఇటు పెద్దిరెడ్డి, అటు రమణకు ఎమ్మెల్సీగా ఛాన్స్ రాకపోవడంతో మాజీ సహచరులకు కేసీఆర్ మొండిచేయి చూపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.