Home /News /politics /

TELANGANA CM KCR GOING TO NEW DELHI TO MEET PM NARENDRA MODI AK

రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్... ఎల్లుండి ప్రధాని మోదీతో భేటీ ?

నరేంద్ర మోదీ, కేసీఆర్

నరేంద్ర మోదీ, కేసీఆర్

గురువారం ఢిల్లీ వెళుతున్న సీఎం కేసీఆర్... శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ప్రధానితో సమావేశమైతే ఏయే అంశాలపై చర్చిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

    లోక్ సభ ఎన్నికల తరువాత ప్రధాని నరేంద్రమోదీని ఇంతవరకు కలవని తెలంగాణ సీఎం కేసీఆర్... త్వరలోనే ఆయనను కలవబోతున్నారా ? సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఖరారైందా ? ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. గురువారం ఢిల్లీ వెళుతున్న సీఎం కేసీఆర్... శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ప్రధానితో సమావేశమైతే ఏయే అంశాలపై చర్చిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌తో అమీతుమీ అంటోంది బీజేపీ.

    ఓ వైపు ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికతో రాష్ట్ర బీజేపీలో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో జరగబోయే భేటీలో కేవలం పరిపాలనకు సంబంధించిన అంశాలు మాత్రమే చరిస్తారా ? లేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం సహా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం అంశంపై సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎంలు కేసీఆర్, జగన్ వరుస భేటీలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, New Delhi, Pm modi, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు