కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ లెక్క ఇదే.. జీడీపీ పెరుగుతుందట..

సీఎం కేసీఆర్ (File Photo)

ఏ దేశాల్లో భూరికార్డులు ప్రక్షాళనై.. ఇబ్బందులు లేకుండా నిర్వహణ జరుగుతుందో ఆయా దేశాల జీడీపీ 3శాతం పెరుగుతోందన్నారు కేసీఆర్. కోర్టులో భూవివాదాల కేసులు జీరోకు చేరి.. ప్రజలకు లీగల్ ఖర్చులు తగ్గుతున్నాయని చెప్పారు.

 • Share this:
  కొత్త రెవెన్యూ చట్టంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. రైతులు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే చట్టం తెస్తున్నామని.. అంతేతప్ప రెవెన్యూ ఉద్యోగులను టార్గెట్ చేయడం లేదని స్పష్టంచేశారు. వీఆర్వోలను తీసేస్తామన్న ప్రచారంలో నిజం లేదని.. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఒక వేళ వీఆర్‌వో వ్యవస్థను రద్దుచేసినా.. ఆ ఉద్యోగులను వేరే శాఖల్లో నియమిస్తామని క్లారిటీ ఇచ్చారు సీఎం. ఒకరి భూమిని మరొకరి పేరిట రాసే దుర్మార్గం పోవాలని..భూ రికార్డులు క్లీన్‌గా ఉండాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.

  రెవెన్యూ చట్టంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. భూముల విషయంలో రైతులు ఎవరికీ లంచం ఇవ్వకూడదనే మా ఆకాంక్ష. పట్టాల మార్పిడి, రిజిస్ట్రేషన్‌కి రూపాయి లంచం ఇవ్వకుండా ఏ రోజుకారోజు కావాలి. అవసరమైతే ఓనర్‌షిప్ కన్‌క్లూజివ్ టైటిల్ ఇవ్వాలి. తద్వారా రైతులకు రక్షణ ఉంటుంది. ప్రజలు, రైతుల మేలు కోరే రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నాం. వీఆర్వోలను తీసేయాల్సి వస్తే తీసేస్తరు. పటేల్, పట్వారీ వ్యవస్థను తీసేస్తే వీరొచ్చారు. ప్రభుత్వం వద్దనుకుంటే పక్కకు జరగాలే. అవసరమైతే ముఖ్యమంత్రినే పీకి పక్కకు పెడతారు ప్రజలు. వీఆర్వోను తీసేస్తే ఉద్యోగాలు తీసేయరు కదా. ఎక్కడో అడ్జస్ట్ చేస్తాం.
  సీఎం కేసీఆర్


  ఏ దేశాల్లో భూరికార్డులు ప్రక్షాళనై.. ఇబ్బందులు లేకుండా నిర్వహణ జరుగుతుందో ఆయా దేశాల జీడీపీ 3శాతం పెరుగుతోందన్నారు కేసీఆర్. కోర్టులో భూవివాదాల కేసులు జీరోకు చేరి.. ప్రజలకు లీగల్ ఖర్చులు తగ్గుతున్నాయని చెప్పారు. తద్వారా ప్రజలకు, దేశానికి లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ఆశించే కొత్త రెవెన్యూ చట్టాన్ని కోరుతున్నామని స్పష్టంచేశారు తెలంగాణ సీఎం. సందర్భాన్ని బట్టి చట్టాలు మారాలని.. అంతేతప్ప ఉద్యోగులను టార్గెట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.
  First published: