HOME »NEWS »POLITICS »telangana cm kcr gives clarity on kaleshwaram project and electricity bills sk

400 టీఎంసీలు...45 లక్షల ఎకరాలు...కాళేశ్వరంపై సీఎం కేసీఆర్ క్లారిటీ

400 టీఎంసీలు...45 లక్షల ఎకరాలు...కాళేశ్వరంపై సీఎం కేసీఆర్ క్లారిటీ
కేసీఆర్ పర్యటన

కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లుల విషయంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఏటా 4,992 కోట్ల బిల్లు మాత్రమే వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

 • Share this:
  కాళేశ్వరం ప్రాజెక్టుపై స్వయం ప్రకటిత మేధావులు, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. రివర్స్ పంపింగ్ చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఎగువ ప్రాంతాలకు వాటర్ లిఫ్టింగ్ చేస్తున్నామని స్పష్టంచేశారు. అల్లాటప్పాగా ప్రాజెక్టులు కట్టలేదని.. 44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలించాకే ప్రాజెక్టులను రీడిజైన్ చేశామన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లుల విషయంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏటా 4,992 కోట్ల బిల్లు మాత్రమే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. సజీవ గోదావరిని చూస్తుంటే మనసు పులకించిపోతుందన్నారు సీఎం కేసీఆర్.

  కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు. స్వయం ప్రకటిత మేధావులు, విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. సజీవ గోదావరిని చూస్తుంటే మనసు పులకించి పోతోంది. 25 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేశాం. ప్రాజెక్టుల రీడిజైన్ అల్లాటప్పాగా చేయలేదు. 44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డుల ఆధారంగా ప్రాజెక్టుల రీడిజైన్ చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా 400 టీఎంసీలు ఒడిసిపట్టుకోవచ్చు. వాటి ద్వారా 45 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. జూన్-నవంబర్ వరకు నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలల్లో 360 టీఎంసీలు వాడుకుంటాం. నవంబర్ నుంచి జూన్ వరకు ఇంకో 40 టీఎంసీలు వాడుకునే అవకాశముంది. విపక్షాల అసత్య ప్రచారాలను నమ్మకండి.
  కేసీఆర్, తెలంగాణ సీఎం
  అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్ భగీరథ అద్భుత ఫలితాలను ఇచ్చింది. మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. మరో నెలలో మిషన్ భగీరథ పూర్తవుతుంది. పేద ధనికులని తేడా లేకుండా అందరికీ రక్షిత మంచి నీరు అందిస్తున్నాం. భవిష్యత్ కోసం శాశ్వత మంచి నీటి వనరులను సమకూర్చుతున్నాం. ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు వంటి పథకాలు ఎక్కడా లేవు. సంక్షేమ పథకాల అమలులతో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది.
  కేసీఆర్, తెలంగాణ సీఎం


  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ గోదావరి నది సందర్శనకు వెళ్లారు. తొలుత మేడిగడ్డకు చేరుకున్న ఆయన.. ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును చూసి సంబురపడ్డారు. మొత్తం 140 కిలోమీటర్ల మేర గోదావరి నదిని పరిశీలించి..అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురికి వెళ్లారు. అక్కడ నరసింహ స్వామిని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్.


  Published by:Shiva Kumar Addula
  First published:August 06, 2019, 17:40 IST