సీఎం కేసీఆర్ గొప్ప మనసు.. రోడ్డు మీద కారు ఆపి మరీ..

సీఎం కేసీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో కనిపించిన ఓ నిస్సహాయుడికి వరాలు అందించారు.

news18-telugu
Updated: February 27, 2020, 9:12 PM IST
సీఎం కేసీఆర్ గొప్ప మనసు.. రోడ్డు మీద కారు ఆపి మరీ..
రోడ్డు మీదే వృద్ధుడికి సాయం చేస్తున్న కేసీఆర్
  • Share this:
సీఎం కేసీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో కనిపించిన ఓ నిస్సహాయుడికి వరాలు అందించారు. వివరాల్లోకెళితే.. గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యలో ఓ వికలాంగ వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించాడు. కారులో వెళ్తూనే అతడ్ని చూసిన సీఎం.. కాన్వాయ్‌ని ఆపించి, కారు దిగి అతడి దగ్గరికి వెళ్లి సమస్యను అడిగారు. తన పేరు మహ్మద్ సలీమ్ అని చెప్పిన ఆ వృద్ధుడు.. గతంలో డ్రైవర్‌గా పనిచేశానని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడి కాలు విరిగిందని, తన కుమారుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడని సీఎంకు వివరించాడు. ఉండటానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు. వెంటనే స్పందించిన సీఎం.. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు.

సలీంతో సీఎం కేసీఆర్ కరచాలనం


ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టోలిచౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లిన కలెక్టర్.. అతడు వికలాంగుడని ధ్రువీకరిస్తూ ఉన్న సదరం సర్టిఫికెట్ పరిశీలించారు. అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేసి, జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు వైద్య చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. సలీమ్ కుమారుడు అనారోగ్యంతో ఉన్నందున సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కాగా, బిజీ షెడ్యూల్‌లోనూ రోడ్డు పక్కన ఉన్న నిస్సహాయుడి స్థితిని గమనించి.. అతడికి వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: February 27, 2020, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading