ఆ దుర్మార్గులకు కరోనా సోకాలి.. శాపం పెట్టిన సీఎం కేసీఆర్..

సోషల్ మీడియా దుష్ప్రచారంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పని గట్టుకొని తప్పుడు వార్తలను వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారని, వారి పని పడతామని హెచ్చరించారు.

news18-telugu
Updated: March 30, 2020, 7:50 AM IST
ఆ దుర్మార్గులకు కరోనా సోకాలి.. శాపం పెట్టిన సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్.. (Photo: facebook)
  • Share this:
సోషల్ మీడియా దుష్ప్రచారంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పని గట్టుకొని తప్పుడు వార్తలను వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారని, వారి పని పడతామని హెచ్చరించారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం.. కొందరు దొంగలు దొరుకుతున్నారని, చాలా కఠినంగా శిక్షిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో గానీ, ఇతర మీడియాల్లో గానీ దుర్మార్గమైన ప్రచారాలు చేసే వాళ్లకు భయంకరమైన శిక్షలు విధిస్తామని చెప్పారు. ఆ శిక్షలు ఎలా ఉంటాయో తాను చూపిస్తానని, తాము గొప్పవాళ్లం, ఎవరూ పట్టుకోలేరన్న అనుకుంటున్న మూర్ఖులకు ఇదే తానిచ్చే హెచ్చరిక అని స్పష్టం చేశారు. ఎంత దుష్ప్రచారం చేస్తారో, అంతకు వంద రెట్లు శిక్ష అనుభవిస్తారని, ఆ చెడు బుద్ధి మానుకోవాలని అన్నారు.

‘దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో ఎందుకీ దిక్కుమాలిన, చిల్లర ప్రచారాలు చేయాలి. ఏం ఆశించి చేస్తున్నారు? ఎవరి శ్రేయస్సు కోరి చేస్తున్నారు? అలా చేసేవాళ్లకు అందరి కంటే ముందు కరోనా సోకుతుంది. సోకాలి కూడా ఆ దుర్మార్గులకు. అలా అయితేనే వారికి కూడా తెలుస్తుంది ఆ బాధేంటో. ఎందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం? ప్రశాంతంగా ఉండే ప్రజలను మానసికంగా హింసించడం?’ అని అన్నారు.

ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తోందని, మంత్రి కూడా రివ్యూ చేస్తున్నారని.. బులిటెన్ విడుదల చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని.. ప్రభుత్వం ఇచ్చే వివరాలను నమ్మాలని సూచించారు.
First published: March 30, 2020, 7:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading