TELANGANA CM KCR DIDNT CAST HIS VOTE IN PANCHAYAT ELECTIONS PS
యాగం కోసం ఓటేయని కేసీఆర్.. ఢిల్లీ వెళ్లేందుకు టైముంది కానీ?
కేసీఆర్ యాగం
’ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు. దాన్ని వృథా చేసుకోవద్దు. ఎంత బిజీగా ఉన్నా ఓటేసి రండి‘ ప్రభుత్వాలు, నాయకులు ప్రతీ సందర్భంలో ఓటు గురించి చేసే ప్రచారమిది. ఎన్నికల సంఘమైతే ఓటు వేయండంటూ ప్రత్యేకంగా ప్రచారకార్యక్రమాలే చేపడుతోంది. మరి, బాధ్యతగల నాయకులే ఓటు వేసే బాధ్యతను మరిచిపోతే? ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది.
’ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు. దాన్ని వృథా చేసుకోవద్దు. ఎంత బిజీగా ఉన్నా ఓటేసి రండి‘ ప్రభుత్వాలు, నాయకులు ప్రతీ సందర్భంలో ఓటు గురించి చేసే ప్రచారమిది. ఎన్నికల సంఘమైతే ఓటు వేయండంటూ ప్రత్యేకంగా ప్రచారకార్యక్రమాలే చేపడుతోంది. మరి, బాధ్యతగల నాయకులే ఓటు వేసే బాధ్యతను మరిచిపోతే? ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది. చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తూ, ఉద్యమనాయకుడిగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేత కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి.. పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదు. తన సొంత నియోజకవర్గం గజ్వెల్లోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర మహాచండీ యాగం నిర్వహిస్తున్న కేసీఆర్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ మారిపోయింది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి.. బాధ్యతను మరిచిపోవడంపై, ఓటేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు file
సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో కేసీఆర్కు ఓటు హక్కు ఉంది. ప్రతీసారి సతీసమేతంగా ఆయన అక్కడికే వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అక్కడే ఓటు వేశారు. అయితే, ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడకలోనూ సోమవారం ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓటు వేయలేదు. దీంతో రాష్ట్రాధినేత అయ్యుండి ఓటేయకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ యాగం
యాగంలో ఉండడం వల్లే ఆయన ఓటు వేయలేకపోయారని, పార్టీవర్గాలు చెబుతున్నాయి. అయితే, యాగం మధ్యలో ఢిల్లీ వెళ్లడానికి టైం దొరికింది కానీ, పక్కనే ఉన్న చింతమడకలో ఓటేసేందుకు టైమ్ దొరకలేదా? అంటూ సెటైర్లు వినబడుతున్నాయి. కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ కూడా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.
ఇది కూడా చూడండి:
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.