Home /News /politics /

TELANGANA CM KCR DECISION ON APPOINTING NEW DISTRICT PRESIDENT CREATE DILEMMA IN SOME LEADERS AK

Telangana Politics: టీఆర్ఎస్‌లో కీలక పరిణామం.. వారిని డైలమాలో పడేసిన కేసీఆర్ ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana News: మంత్రులెవరికీ జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టని టీఆర్ఎస్ బాస్.. ఈ నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో వీరిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేదేమో అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

    తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేయని టీఆర్ఎస్.. అసలు ఈ పదవులను భర్తీ చేయాలా ? వద్దా ? అనే అంశంపై కొంతకాలం తర్జనభర్జన పడింది. జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తామని కొంతకాలం క్రితం ప్రకటించినా.. దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో గులాబీ బాస్ ఈ విషయంలో వెనక్కి తగ్గారేమో అని చాలామంది భావించారు. కానీ ఉన్నట్టుండి టీఆర్ఎస్ నాయకత్వం జిల్లా అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 33 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. వీరిలో ఎక్కువగా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చింది. కొన్ని చోట్ల ఎంపీలు, జడ్పీ చైర్‌పర్సన్‌లకు కూడా అవకాశం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉండదేమో అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

    త్వరలోనే సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించి కొత్తవారికి చోటు కల్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రేసులో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమకు ఈసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు. అలాంటి వారిలో బాల్క సుమన్, , జోగు రామన్న, ఆరూరి రమేశ్, దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు మాజీమంత్రులు జోగు రామన్న, లక్ష్మారెడ్డిలు ఉన్నారు. అయితే తాజాగా వీరికి జిల్లా అధ్యక్షులుగా నియమించింది టీఆర్ఎస్ నాయకత్వం.

    మంత్రులెవరికీ జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టని టీఆర్ఎస్ బాస్.. ఈ నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో వీరిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేదేమో అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. అసలు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడతారే లేదో అనే టాక్ కూడా టీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది.

    Telangana Politics: కేసీఆర్‌కు ఈసారి ఆ ఎమ్మెల్యేలతో అలాంటి తలనొప్పులు తప్పవా ?

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆ నేతనే ఫాలో అవుతున్నారా ?.. అదే కరెక్ట్ అని నమ్ముతున్నారా ?

    జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే చాలా జిల్లాలకు ఎమ్మెల్యేలనే జిల్లా అధ్యక్షులుగా నియమించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని.. కొన్ని చోట్ల ఎమ్మెల్సీలకు ఈ రకమైన ఛాన్స్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంటుందనే సంకేతాలను టీఆర్ఎస్ ఇచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు