నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్ దూరం... కారణం అదేనా...

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 14, 2019, 12:38 PM IST
నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్ దూరం... కారణం అదేనా...
కేసీఆర్ (File)
news18-telugu
Updated: June 14, 2019, 12:38 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో... ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో... నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధాని సహా ఇతర కేంద్రమంత్రులను కేసీఆర్ ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది.

అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని కేసీఆర్ తాజాగా నిర్ణయించుకున్నారని... ఆయన తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పనులతో పాటు రాష్ట్రంలోని పలు శాఖలపై కీలకమైన సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నందునే కేసీఆర్ నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్లడం లేదని సమాచారం. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్... రెండు రోజుల పాటు అక్కడే ఉండి పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.


First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...