హోమ్ /వార్తలు /politics /

Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

సీఎం కేసీఆర్‌తో హరీశ్ రావు  (ఫైల్​)

సీఎం కేసీఆర్‌తో హరీశ్ రావు (ఫైల్​)

Harish Rao: కరోనా కష్టకాలంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై వేటు వేసిన సీఎం కేసీఆర్.. ఆ శాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత ఆయన నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖను కొన్ని నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్న సీఎం కేసీఆర్.. తాజాగా ఈ శాఖను ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా రాబోతున్నట్టు సమాచారం. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నారు.

కరోనా కష్టకాలంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై వేటు వేసిన సీఎం కేసీఆర్.. ఆ శాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించారు. హైదరాబాద్, వరంగల్ సహా పలు నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించారు. అప్పట్లోనే ఇందుకు సంబంధించిన సమీక్షల్లో మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొనడంతో.. ఈ శాఖను కేసీఆర్ ఆయనకే ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హర్షవర్ధన్‌తో జరిగిన సమీక్షలోనూ మంత్రి హరీశ్ రావు పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?

ఈ పరిణామాలను గమనించిన వాళ్లు.. త్వరలోనే మంత్రి హరీశ్ రావుకు వైద్య,ఆరోగ్యశాఖ ఇవ్వడం దాదాపు ఖాయమనే వాదన వినిపించాయి. అయితే కేసీఆర్ మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొద్దిరోజుల క్రితం హుజూరాబాద్ ఉప ఎన్నికలు కూడా పూర్తికావడంతో సీఎం కేసీఆర్ ఈ అంశంపై దృష్టి పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈటల రాజేందర్‌ను తప్పించడం ద్వారా ఖాళీ అయిన స్థానంలో పాటు మరికొందరిని తప్పించి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే యోచనలో కేసీఆర్ ఇంతకాలం ఈ శాఖను తన దగ్గరే పెట్టుకోవాలని అనుకున్నట్టు ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ అంశంపై తన ఆలోచన మార్చుకున్న సీఎం కేసీఆర్.. హరీశ్ రావుకు వైద్య,ఆరోగ్యశాఖను అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

First published:

Tags: CM KCR, Harish Rao, Telangana

ఉత్తమ కథలు