తెలంగాణలో ప్లాస్టిక్ బ్యాన్.. అమల్లోకి వచ్చేది ఎప్పటి నుంచి అంటే..

సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణలో దీన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

news18-telugu
Updated: October 10, 2019, 8:52 PM IST
తెలంగాణలో ప్లాస్టిక్ బ్యాన్.. అమల్లోకి వచ్చేది ఎప్పటి నుంచి అంటే..
మంత్రి కేటీఆర్
news18-telugu
Updated: October 10, 2019, 8:52 PM IST
తెలంగాణలో సింగల్ యూజ్ (ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌)ను బ్యాన్ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘తెలంగాణలో సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై తీర్మానం చేస్తారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇది అమలవుతుంది. దీనికి సంబంధించి పర్యావరణ ప్రేమికుల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ దిశగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. తెలంగాణలో కూడా ప్లాస్టిక్ బ్యాన్‌ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసే అంశంలో జీహెచ్ఎంసీ ఎప్పటి నుంచో కార్యక్రమాలు చేపడుతోంది.కూరగాయలు, పండ్ల మార్కెట్లకు వెళ్లేటప్పుడు ఇంటి వద్ద నుంచే జనపనార సంచులను తీసుకెళ్లాలని సూచించింది. మాంసం దుకాణాలకు వెళ్లేవారు స్టీల్ డబ్బాలు, క్యాన్లు తీసుకుని వెళ్లాలంటూ ప్రచారం కల్పించారు. కొన్నిచోట్ల సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడే చిరు వ్యాపారులకు జరిమానాలు కూడా విధించారు. అయితే, అది తొలిదశలో ఉధృతంగా కొనసాగినా.. మెల్లమెల్లగా మళ్లీ జనం ప్లాస్టిక్ బ్యాగ్‌ల వైపు మళ్లారు.
Loading...
Video : చంద్రబాబు మూతిపై వాత పెట్టాలన్న వైసీపీ ఎమ్మెల్యే

First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...