కాంగ్రెస్, చంద్రబాబులను చీల్చి చెండాడిన కేసీఆర్!..

రాబోయే ఎన్నికల్లో రూ.500కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని, అందుకే పొత్తు కుదిరిందని కేసీఆర్ ఆరోపించారు.

news18-telugu
Updated: October 3, 2018, 7:52 PM IST
కాంగ్రెస్, చంద్రబాబులను చీల్చి చెండాడిన కేసీఆర్!..
నిజామాబాద్ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్..
  • Share this:
నిజామాబాద్ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్, ఏపీ సీఎం చంద్రబాబులను చీల్చి చెండాడారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. చావు నోట్లో తలపెట్టి మరీ తెలంగాణ కోసం పోరాడితే.. సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఢిల్లీ పాదాల వద్ద, అమరావతి చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

తెలంగాణలో 7 మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆయనతో పొత్తు అంటే కాంగ్రెస్ పార్టీ కాస్తయినా సిగ్గుపడాలి అని విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు కేంద్రానికి 36 లేఖలు రాశారని.. అలాంటివాడితో పొత్తు పెట్టుకోవడమేంటి? అని ప్రశ్నించారు. 1200మంది అమరులు ప్రాణాలు అర్పిస్తే సాధించుకున్న తెలంగాణను.. దాచి దాచి దెయ్యాలకు అప్పగించినట్టు.. చంద్రబాబు చేతికి అప్పగిద్దామా? అని నిలదీశారు.


రాబోయే ఎన్నికల్లో రూ.500కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని, అందుకే పొత్తు కుదిరిందని కేసీఆర్ ఆరోపించారు. చార్టెడ్ విమానాలు, ప్రచార ఖర్చులు పెట్టుకున్నానని చంద్రబాబు వాళ్లకు భరోసా ఇచ్చాడని.. అందుకే మళ్లీ ఆయన్ను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటుతో తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.

ఇక గోదావరి ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడకుండా చేశామన్నారు. ఇంతా చేస్తే.. ఇదంతా మేము 1975లోనే చేశాం.. 76లోనే చేశామని కాంగ్రెస్ వాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని గుర్తుచేశారు. అదే నిజమైతే.. ఆ అగ్రిమెంట్ కాగితాలను తీసుకురావాలని తాను ఆనాడే సవాల్ విసిరానని, దానికి కాంగ్రెస్ వద్ద సమాధానం లేకుండా పోయిందని అన్నారు.

ఇది కూడా చదవండి: Highlights: నిజామాబాద్‌లో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్..

Published by: Srinivas Mittapalli
First published: October 3, 2018, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading