ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

అది డెడ్ ఇన్వెస్టిమెంట్, కట్టొద్దు వేస్టని, దానికంటే రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే బెటరని చంద్రబాబుకు చెప్పానని గుర్తు చేశారు సీఎం కేసీఆర్.

news18-telugu
Updated: September 16, 2019, 8:09 AM IST
ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ (Source: Twitter)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఇటు తెలంగాణసీఎం కేసీఆర్ కూడా ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... అమరావతి నిర్మాణం దండగని.. అదో డెడ్ ఇన్వెస్టిమెంట్‌గా మిగిలిపోతుందని చంద్రబాబుకు అప్పుడే చెప్పానన్నారు.

ఎత్తిపోతలకు కరెంటు బిల్లులపై కేసీఆర్ మాట్లాడుతూ.. ఎత్తిపోతలకు కరెంటుపై కొందరు ఎత్తిపొడిచారని గుర్తు చేశారు. జయప్రకాశ్ నారాయణ అనే ఆయన ఎత్తిపోతలకు కరెంటు వేస్టన్నాడని, ఆయనది ఈ రాష్ట్రం కాదు, ఈ మన్నూ కాదని విమర్శించారు. కానీ పక్క రాష్ట్రంలో రూ.53 వేల కోట్లతో అమరావతి కడుతుంటే మాత్రం డప్పు కొడతానంటాడని తీవ్ర విమర్శలు చేశారు. అది డెడ్ ఇన్వెస్టిమెంట్, కట్టొద్దు వేస్టని, దానికంటే రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే బెటరని చంద్రబాబుకు చెప్పానని గుర్తు చేశారు. అయినా చంద్రబాబు వినలేదని, ఇప్పుడేమైందో అందరూ చూస్తున్నారన్నారు సీఎం కేసీఆర్.

సమైక్య రాష్ట్రంలో రూ.69వేల కోట్లు అప్పులు చేశారన్నారు. అప్పులపై రాష్ట్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెండు పంటల్లో కాళేశ్వరం అప్పు తీరుతుందన్నారు కేసీఆర్. రైతులకు 9 గంటలపాటు ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004లో మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading