ఇది భయానక పరిస్థితి... ఆర్థిక మాంద్యంపై సీఎం కేసీఆర్

రాష్ట్రం కోసం అప్పులు తీసుకొచ్చి మేం దావత్‌లు చేసుకోవడం లేదన్నారు. తీసుకొస్తున్న అప్పుల్ని ఏం చేస్తున్నారనేది ప్రశ్న అన్నారు సీఎం కేసీఆర్.

news18-telugu
Updated: September 15, 2019, 12:47 PM IST
ఇది భయానక పరిస్థితి... ఆర్థిక మాంద్యంపై సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్.. (Photo: facebook)
  • Share this:
ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై పడిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ బడ్జెట్‌పై బదులిస్తూ సీఎం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ వృద్ధిరేటు తగ్గుతూ వస్తుందన్నారు. ఇది భయానక పరిస్థితి అన్నారు కేసీఆర్. ఆర్థిక మాంద్యంలో దేశం ఏమవుతుందోనన్న భయం అందరిలో ఉందన్నారు. దేశంలో ఆర్థికమాంద్యం ఉందని నిపుణులు చెబుతునే ఉన్నారన్నారు. ఆనంద్ మహింద్రా లాంటి వాళ్లు మూడేళ్ల వరకు కోలుకోలేమని చెబుతున్నారన్నారు. కేంద్రానిది కర్ర పెత్తనమే అన్నారు. రాష్ట్రాలపై కర్ర పెత్తనం చేయకుండా కేంద్రం తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రెండు లక్షల 70వేల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి పోయాయన్నారు. మనకు నిధులు రూపంలో వచ్చేవి మాత్రం 30వేల కోట్లు అన్నారు కేసీఆర్. భారతదేశాన్ని శాసించే ఆరు ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక్కటన్నారు. ఆర్థిక నిర్ణయాలు రాష్ట్రం చేతుల్లో ఉండేది చాలా తక్కువ... ఎక్కువ మొత్తం 99 శాతానికి పైగా కేంద్రం పరిధిలోనే ఉంటాయన్నారు. రుణాల విషయంలో అమెరికా, జపాన్ మనకు రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ విషయంలో భేషజాలకు పోలేదన్నారు సీఎం. ఆర్థిక నిపుణుల్ని సంప్రదించే బడ్జెట్ రూపొందించామన్నారు. రాష్ట్రం కోసం అప్పులు తీసుకొచ్చి మేం దావత్‌లు చేసుకోవడం లేదన్నారు. తీసుకొస్తున్న అప్పుల్ని ఏం చేస్తున్నారనేది ప్రశ్న అన్నారు. అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నామన్నారు. అత్యధిక అప్పులున్న జపాన్ దేశం అందర్నీ శాసిస్తుందన్నారు.


First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు