ధాన్యం కొనుగోలు అంశం సహా అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసిందన్న కేసీఆర్.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతుబంధు వేదిక దగ్గర చర్చలు నిర్వహించి ఈ అంశంపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని.. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి వారికి అవగాహన కల్పించాలని కేసీఆర్ పార్టీ నేతలకు తెలిపారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని.. మిల్లర్లతో టై అప్ ఉన్నోళ్లు వరి వేసుకోనివ్వాలని అన్నారు. రైతు బంధు యథావిధిగా ఇస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నేతలందరూ చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదే అని కేసీఆర్ నేతలకు భరోసా ఇచ్చారు.
నాయకులకు ఓపిక ఉండాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు కచ్చితంగా పదవులు వస్తాయని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామమని అన్నారు. ఈ సందర్భంగా దళితబంధు పథకంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఈ పథకం ఇస్తామని చెప్పారు. ఆ తరువాత దశలవారీగా అందరికీ అమలు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కొత్తగా నియామకమైన కార్పొరేషన్ చైర్మన్లు కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు, కీలక నేతలు హాజరయ్యారు.
బీజేపీ వ్యూహానికి ఆదిలోనే చెక్ పెడుతున్న CM KCR.. ఆ ప్లాన్‌లో భాగమేనా ?
Breaking : మరో ఐదు కార్పోరేషన్లకు చైర్మన్లు.. నియమించిన సీఎం కేసీఆర్..వాళ్లు ఎవరంటే..
ఇదిలా ఉంటే శనివారం మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈనెల 19 నుంచి సీఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం… శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం, బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.