నోడౌట్ మాదే సర్కార్.. ఓటు వేసిన కేసీఆర్

Telangana Assembly poll 2018: నో డౌట్.. గెలుపు మాదే. చాలా చాలా అనుకూల పవనాలు ఉన్నాయన్నారు గులాబీ బాస్ కేసీఆర్

news18-telugu
Updated: December 7, 2018, 2:42 PM IST
నోడౌట్ మాదే సర్కార్.. ఓటు వేసిన కేసీఆర్
మరోసారి మాదే విజయమంటున్న కేసీఆర్
  • Share this:
సిద్ధిపేట జిల్లా చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. సతీ సమేతంగా ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. బూత్ నెంబర్ 13లో ఆయన ఓటు వేశారు. కేసీఆర్ సతీమణి కూడా అదే బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

kcr
చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్


మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. మాకు అనుకూలంగానే పవనాలు వీస్తున్నాయన్నారు. పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు. మాకు అనుకూలంగానే ప్రజా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్‌తో ఆ విషయం మీకే తెలుస్తుందన్నారు.

kcr vote
చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్


‘సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ మీరే చూస్తారు. నో డౌట్.. గెలుపు మాదే. చాలా చాలా అనుకూల పవనాలు ఉన్నాయి. మంచి ఫలితాలు ఉంటాయి. పోలింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా వృద్దులు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.’-చింతమడకలో ఓటు వేసిన అనంతరం మీడియాతో కేసీఆర్.

kcr vote
ఓటు వేస్తున్న కేసీఆర్


First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading