Home /News /politics /

TELANGANA CM KCR APPOINTS MLC PALLA RAJESHWAR REDDY AS RYTHU SAMANVYA SAMITHI CHAIRMAN BA

పల్లా రాజేశ్వర్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్...

సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

రైతుసమన్వయ సమితి అధ్యక్షునిగా తనను నియమించాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

    టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వచ్చే జూన్ లోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు . రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై మూడు నాలుగు రోజులలోనే వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు.

    రైతుసమన్వయ సమితి అధ్యక్షునిగా తనను నియమించాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్ లో సీఎంను కలిసి ధన్యవాదాలు చెప్పారు. రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. రైతులకు అన్ని వేళలా అండదండగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను సమర్థవంతంగా నిర్వహించాలని రాజేశ్వర్ రెడ్డి కోరారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: CM KCR, Telangana, Trs

    తదుపరి వార్తలు