TELANGANA CM KCR APPOINTED MLA BAJIREDDY GOVARDHAN AS TSRTC CHAIRMAN AK
Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కీలక పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
Bajireddy Govardhan as TSRTC Chairman: 2014లో జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆ తరువాత వేముల ప్రశాంత్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచే బాజిరెడ్డి గోవర్ధన్‌కు సీఎం కేసీఆర్ కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్ నేత, నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ తరపున 2014, 2018 నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు. జిల్లాలోని సీనియర్ నాయకుల్లో ఒకరిగా ఉన్న ఆయన మంత్రివర్గంలో స్థానం ఆశించారు. అయితే 2014లో జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆ తరువాత వేముల ప్రశాంత్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచే బాజిరెడ్డి గోవర్ధన్‌కు సీఎం కేసీఆర్ కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనకు కీలకమైన నామినేటెడ్ పదవుల్లో ఒకటైన ఆర్టీసీచైర్మన్ పదవిని అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. త్వరలోనే పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరునాటికి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రస్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు.
ఈ సందర్భంగానే ఆయన పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే అంశంపై దృష్టి పెట్టామని తెలిపారు. దీంతో పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. చాలాకాలం నుంచి పెండింగ్‌లో పార్టీ నామినేటెడ్ పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. అయితే వీటిని పెండింగ్‌లో పెడుతూ వస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. నేతల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు త్వరలోనే నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకు కూడా పదవులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారని సమాచారం. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కడంతో.. మిగతా ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే నామినేటెడ్ పదవులు దక్కడం ఖాయమనే చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.