జగన్, కేసీఆర్ భేటీలో ఏం జరిగింది ? బీజేపీకి వ్యతిరేకంగా ఇద్దరూ ఒక్కటయ్యారా?

ముఖ్యంగా కేంద్రం నుంచి ప్రతీ విషయంలో ఎదురవుతున్న జోక్యం, సహాయ నిరాకరణ గమనిస్తే ఇరువురు సీఎంలు దీనిపై మాట్లాడుకోవడం కూడా తప్పేమీ కాదు. కానీ సీఎంవో ఉలికిపాటు గమనిస్తే ఏదో భయం కనిపించింది.

news18-telugu
Updated: September 24, 2019, 11:06 AM IST
జగన్, కేసీఆర్ భేటీలో ఏం జరిగింది ? బీజేపీకి వ్యతిరేకంగా ఇద్దరూ ఒక్కటయ్యారా?
కేసీఆర్‌తో జగన్ భేటీ (File)
  • Share this:
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కొంతకాలంగా తరచుగా భేటీ అవుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారంతో పాటు గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లింపు సహా పలు అంశాలు వీరిద్దరి మధ్య భేటీల్లో సర్వసాధారణం అవుతున్నాయి. అయితే వీటికి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం లేదా ? పొరుగు రాష్ట్రాలుగా ఇరువురు తమ సమస్యలతో పాటు కేంద్రం నుంచి అందుతున్న సహకారంపై చర్చించుకోరా ? ప్రగతి భవన్ వేదికగా ఈసారి జరిగిన భేటీ మాత్రం రాజకీయంగా కలకలం రేపింది.

kcr,jagan kcr,jagan,ys jagan,jagan meets kcr,jagan meet cm kcr,ap cm ys jagan meets kcr,cm kcr,ap cm ys jagan meets kcr and ktr,ys jagan meets kcr pragathi bhavan,ys jagan meets kcr live hyderabad,ap cm ys jagan meets kcr pragathi bhavan,telangana cm kcr,jagan live,telangana news,ap cm ys jagan,jagan mohan reddy,telangana cm kcr and ap cm ys jagan,వైఎస్ జగన్,కేసీఆర్,భేటీ,చర్చలు,ప్రగతిభవన్,తెలంగాణ న్యూస్,తెలుగు న్యూస్,
జగన్, కేసీఆర్ (File)


ఓ వైపు కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ, తెలంగాణలో దూసుకొస్తున్న బీజేపీ, మరోవైపు మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్, జగన్ వ్యవహారశైలిని నిశితంగా గమనిస్తున్న బీజేపీ అధినాయకత్వం, తెలుగు రాష్ట్రాల్లో కీలక సమస్యలపై ఎలాంటి హామీలు ఇవ్వని ప్రధాని, గతంలో ఇచ్చిన హామీల అమలుకు కూడా సిద్ధం కాని నేపథ్యంలో కేసీఆర్, జగన్ భేటీ ఎప్పుడు జరిగినా ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్రం వ్యవహారశైలిపై కాస్త సీరియస్ గానే మాట్లాడుకున్నారన్న వార్తలు... వీటికి ఖండనంగా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇవాళ ఉదయం వెలువడిన ఓ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Cm kcr suggestion to ap cm ys jagan, cm kcr comments on Amaravati, ap cm ys jagan, chandrababu naidu, rayalaseema, ap news, ap politics, సీఎం జగన్‌కు కేసీఆర్ సలహా, అమరావతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, రాయలసీమ, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్


వాస్తవానికి నిన్నటి కేసీఆర్, జగన్ భేటీకి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాల నుంచి పూర్తి వివరాలు బయటికి రాలేదు. రాత్రి 10 గంటల వరకూ సుదీర్ఘంగా సాగిన భేటీ దీనికి ఓ కారణమనుకుంటే, నాలుగు గంటల భేటీలో చర్చించిన విషయాల్నీ అప్పటికప్పుడు బయటపెట్టడం కూడా అధికారులకు కష్ట సాధ్యమన్న వాదనలు వినిపించాయి. దీంతో సహజంగానే కేసీఆర్, జగన్ భేటీలో ఏయే అంశాలు చర్చించారనే విషయంపై ప్రతీ మీడియా సంస్ధా ఎవరి వాదన వారు జనంలోకి వదిలారు. దీనిపై ఏపీ సీఎంవో ఇచ్చిన వివరణ కమ్ ఖండన గమనిస్తే కేసీఆర్, జగన్ భేటీలో రాజకీయ అంశాల ప్రస్తావనే రాలేదు అని తెలిపారు.

కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో బీజేపీకి లక్ష్యంగా మారిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రావని ఎవరూ భావించే పరిస్ధితి లేదు. ముఖ్యంగా కేంద్రం నుంచి ప్రతీ విషయంలో ఎదురవుతున్న జోక్యం, సహాయ నిరాకరణ గమనిస్తే ఇరువురు సీఎంలు దీనిపై మాట్లాడుకోవడం కూడా తప్పేమీ కాదు. కానీ సీఎంవో ఉలికిపాటు గమనిస్తే ఈ వ్యవహారం బీజేపీ హైకమాండ్ కు చేరితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అన్న భయం కనిపించింది.

Ap telangana cms meet,cm kcr ys jagan mohan reddy meeting,telangana ap ministers meet,kcr ys jagan discussions on Godavari water,ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం,కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి భేటీ,ఏపీ తెలంగాణ మంత్రుల సమావేశం,గోదావరి నీటిపై కేసీఆర్ జగన్ భేటీ
ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్,జగన్
ఏపీలో ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో కేంద్రం నుంచి ఈ మధ్య ఎలాంటి హామీ ప్రకటన రాలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రెవెన్యూలోటు భర్తీకి సంబంధించి కూడా ఎలాంటి స్పందనా లేదు. మిగతా హామీల పరిస్ధితి ఎలా ఉన్నా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం వైసీపీ గతంలో తీవ్రంగా పోరాటం చేసింది. వైసీపీ ఒత్తిడి వల్లే టీడీపీ అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి తమ మంత్రులను ఉపసంహరించుకోవడంతో పాటు ఏకంగా ఎన్డీయేకే గుడ్ బై చెప్పి పోరాటానికి సిద్ధపడింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడితే ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలవుతాయని జనం భావించారు. వారి ఆకాంక్షలకు తగినట్లుగా జగన్ సర్కారు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కేంద్రం నుంచి ఆ మేరకు సహకారం లభించనప్పుడు దానిపై చర్చించడం కూడా తప్పేమీ కాదు.
అలాగే తెలంగాణలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖ భూముల కేటాయింపుపై కేసీఆర్ పట్టుబట్టడంలో తప్పులేదు. అటువంటప్పుడు ఆయా అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకోవడంలోనూ ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఇవాళ కాకపోతే రేపయినా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం జరగాల్సిందే. దీనిపై బీజేపీ ప్రతికూలంగా స్పందిస్తుందన్న భయాలు ఎందుకన్న వాదన వినిపిస్తోంది.

(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)

ఇవికూడా చదవండి:

ఆ పత్రికా కథనం అవాస్తవం... ఏపీ సీఎం కార్యాలయం సీరియస్

సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం... రోల్ ఏంటో తెలుసా ?
Published by: Sulthana Begum Shaik
First published: September 24, 2019, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading