ఒకే వేదికపై కేసీఆర్, రేవంత్ రెడ్డి... చేతిలో చెయ్యేసి...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు. అయితే, వారిద్దరూ ఒకే వేదిక మీద కలిశారు.

news18-telugu
Updated: February 7, 2020, 9:57 PM IST
ఒకే వేదికపై కేసీఆర్, రేవంత్ రెడ్డి... చేతిలో చెయ్యేసి...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు. అయితే, వారిద్దరూ ఒకే వేదిక మీద కలిశారు. ఆ ఇద్దరినీ కలిపింది హైదరాబాద్ మెట్రో రైల్. ఈరోజు హైదరాబాద్ మెట్రోరైల్ కారిడార్ 2 ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. జూబ్లి బస్ స్టేషన్ - మహాత్మాగాంధీ బస్ స్టేషన్ మధ్య ఉన్న ఈ మార్గాన్ని కేసీఆర్ ప్రారంభించి అనంతరం దాంట్లో ప్రయాణించారు. ఈ వేడుకకు మల్కాజ్ గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డికి కూడా పెద్ద పీట వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రిబ్బన్ కట్ చేస్తున్న సమయంలో పక్కనే రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. కేసీఆర్ పక్కన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఓసారి పరిశీలిస్తే రేవంత్ రెడ్డి, పద్మారావు ఇద్దరూ చేతిలో చెయ్యివేసి ‘మంచి దోస్త్‌’ల్లా కనిపించారు.

మెట్రో రైలు కారిడార్ 2 ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో మంత్రి కేటీఆర్ ముచ్చట్లు


కొత్తగా ప్రారంభించిన దాన్ని మెట్రో కారిడార్ 2గా పిలుస్తారు. జేబీఎస్ - ఎంజీబీఎస్ మధ్యలో 9 స్టేషన్లు ఉన్నాయి. 11 కిలోమీటర్ల దూరం ఉంది. 16 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే అతి పెద్ద రెండో మెట్రోగా ఆవిర్భవించనుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు. కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌లో మొత్తం 69.2 కిలోమీటర్ల మెట్రో రూట్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. ఇప్పటికే హైదరాబాద్ సుమారు 150కి పైగా అవార్డులను అందుకుంది.

మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ 
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. కారు పార్టీ వేగానికి రేవంత్ రెడ్డి కొడంగల్‌ అసెంబ్లీ స్థానంలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు. యాదృచ్ఛికంగా రేవంత్ రెడ్డి తొలుత టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్  పార్టీలో ఉన్నారు.
First published: February 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు