Home /News /politics /

TELANGANA CM KCR ADDED POETRY IN HIS SPEECH WHILE ADDRESSING NEWLY ELECTED NEW SURPANCHS PS

తెలుగు మాస్టారు కేసీఆర్... సర్పంచ్‌లకు పద్యాలు చెప్పిన సీఎం

సీఎం కేసీఆర్(File)

సీఎం కేసీఆర్(File)

భాషా పరిజ్ఞానంలో కేసీఆర్ ఎంతటి నిష్ణాతులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగే టాలెంట్ ఆయన సొంతం. ప్రసంగాల్లో పద్యాలను కూడా వల్లె వేస్తుంటారు.

    తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం శిక్షణాకార్యక్రమాలు చేపట్టింది. ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా సర్పంచులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పాలన ఎలా సాగించాలనే విషయమై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు మాస్టారుగా మారిపోయారు. ప్రసంగంలో ప్రతీ అంశానికి సూటయ్యేలా.. సందర్భోచితంగా పద్యాలను ఉటంకిస్తూ.. సర్పంచులకు అర్థమయ్యేలా చెప్పారు.

    సర్పంచ్‌లకు శిక్షణనిచ్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పద్యాలు వినిపించి.. వాటి అర్థాలను వివరిస్తూ అవి సర్పంచుల పాలనలో ఎలా ఉపయోగపడుతాయో తెలియజెప్పారు. ‘‘ అనగననగ రాగ మతిశయిల్లుచునుండు’’ అనే వేమన పద్యాన్ని పాడి వినిపించిన కేసీఆర్.. తినగా తినగా వేపాకు తియ్యగా మారినట్టుగానే.. గ్రామాల్లో సంస్కరణల అమలు నిరంతర ప్రక్రియగా సాగితే కొంతకాలానికి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అది అలవాటుగా మారిపోతుందని వివరించారు. ఇక, ‘‘ నయమున బ్రాలున్ ద్రావరు, భయమునను విషమ్మునైనా భక్షింతురుగా’’ అనే సుమతి శతకంలోని మరో పద్యాన్ని ఉదహరించిన ముఖ్యమంత్రి.. గ్రామాల్లో అవినీతికి పాల్పడేవారిని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని కఠినంగా శిక్షించాలని.. భయం ఉంటేనే బాగా పనిచేస్తారని, పాలన పారదర్శకంగా సాగుతుందని వివరించారు.

    telangana cm kcr, kcr poetry, poetry in kcr speech, awareness program for telangana surpachs, telangana news, తెలంగాణ సీఎం కేసీఆర్, కేసీఆర్ పద్యాలు, పద్యాలు పలికిన కేసీఆర్, తెలంగాణ సర్పంచులకు శిక్షణ, కేసీఆర్ ప్రసంగంలో పద్యాలు
    కేసీఆర్ ఫైల్


    ’’ జాతస్యహి మరణం ధృవం‘‘ అనే భగవద్గీత శ్లోకాన్ని వినిపించిన సీఎం.. పుట్టినవారు గిట్టక తప్పదు కాబట్టి చనిపోయిన తర్వాతి కార్యక్రమాలను గౌరవప్రదంగా, మర్యాదగా నిర్వహించడానికి స్మశానవాటికలను నిర్మించాల్సిన అవసరాన్ని సర్పంచులకు వివరించారు. బతికినంత కాలం కులం పేరిట, మతం పేరిట కొట్టుకు చచ్చినా.. చనిపోయిన తర్వాతనైనా ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక చివరగా ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై’ అనే ఏనుగు లక్ష్మణకవి సుభాషితాన్ని పలికిన కేసీఆర్.. గ్రామాల వికాసానికి మంచి సంకల్పంతో నడుం బిగించి, తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన స్పూర్తితో ముందుకు సాగాలని.. సర్పంచ్‌లకు ఉద్బోధ చేశారు.
    First published:

    Tags: CM KCR, Gram Panchayat Elections, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు