HOME »NEWS »POLITICS »telangana cm kalvakuntla chandrashekar rao kcr meets pm modi in delhi sk

CM KCR-PM Modi: ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ.. ఏం చర్చించారంటే..

CM KCR-PM Modi: ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ.. ఏం చర్చించారంటే..
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ

PM Modi CM KCR Meeting: తెలంగాణ రాష్ట్రానికి పలు కీలక అంశాలపై ప్రధానితో సీఎం చర్చలు జరిపినట్లు సమాచారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలు చర్చకు వచ్చాయి.

  • Share this:
    ఢిల్లీ పర్యటనలో బిజీగా బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ (KCR) రావు కాసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పలు కీలక అంశాలపై ప్రధానితో సీఎం చర్చలు జరిపినట్లు సమాచారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టులపైనా ప్రధాని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారట. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం సహకారం అందించాలని తెలంగాణ సీఎం కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు జీఎస్టీ బకాయి నిధులను విడుదల చేయాలని, హైదరాబాద్‌లో వరద బాధితుల కోసం తక్షణం నిధులు మంజూరు చేయాలని కోరినట్లు సమాచారం.




    సీఎం కేసీఆర్ నిన్న ఉదయం ఢిల్లీకి వెళ్లారు. మొదట కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత‌ను కలిశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాల గురించి ఇరువురు చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న హామీలను అమలు చేయాలని కోరారు. ఇక ఇవాళ ఉదయం కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురితో భేటీ అయ్యారు. తెలంగాణ ఆరో చోట్ల దేశీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 2018లోనే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక అందజేశామని.. త్వరితగతిన అనుమతులు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.
    Published by:Shiva Kumar Addula
    First published:December 12, 2020, 19:47 IST