Home /News /politics /

TELANGANA CM K CHANDRASHEKAR RAO KCR CALLED FOR MEDIA MEETING AND CANCELLED IN LAST MINUTE AK

Telangana News: కేసీఆర్ మనసు మార్చుకున్నారా ?.. జాతీయ మీడియాను పిలిచి చివరి నిమిషంలో..

సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)

Telangana News: ఇటీవల కేసీఆర్ పలువురు నేతలతో జరుపుతున్న సమావేశాల నేపథ్యంలో ఆయన కూడా ఈ ఏదో ఆసక్తికరమైన ప్రకటన లేదా వ్యాఖ్యలు చేస్తారని చాలామంది భావించారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేదు. ఈ రోజు కేబినెట్ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడతారని వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి మీడియా ప్రతినిధులకు కూడా సమాచారం అందింది. ముఖ్యంగా జాతీయ మీడియా ప్రతినిధులకు ఈ సమావేశం గురించి ప్రత్యేకంగా సమాచారం ఇచ్చారట అధికారులు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. చివరి నిమిషంలో కేసీఆర్ మీడియా సమావేశం రద్దయ్యింది. అయితే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఎందుకు రద్దయ్యిందనే దానిపై ఆసక్తికర అంశాలు చర్చకు వస్తున్నాయి. నిజానికి ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీలో కరోనా కట్టడి కోసం చర్యలు, నైట్ కర్ఫ్యూ వంటి అంశాలు కీలకమవుతాయని అంతా అనుకున్నారు. కానీ సమావేశంలో మరికొన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

    అయితే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఉంటే.. అంతా ఆయన ఇటీవల జరిపిన సమావేశాల గురించే ప్రశ్నిస్తారని వేరే చెప్పనవసరం లేదు. కొంతకాలంగా బీజేపీ, కేంద్రంపై తనదైన శైలిలో ఫైర్ అవుతున్న సీఎం కేసీఆర్.. జాతీయస్థాయిలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టడుతున్నారు. ఇందుకోసం వామపక్షాలకు చెందిన ముఖ్యనేతల్లో ఒకరు, కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు బీహార్‌లోని ఆర్జేడీ సారథి తేజస్వి యాదవ్‌తో సమావేశం నిర్వహించారు. అవసరమైతే టీఆర్ఎస్ అధినేత ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారం చేయడమో లేక ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరడమో చేస్తారనే ప్రచారం కూడా సాగింది.

    సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తే.. అంతా ఈ అంశంపైనే ప్రశ్నిస్తారు. ఆయన కూడా వీటిపై ఏదో ఒకటి కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అందుకే సీఎం కేసీఆర్ ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి కేంద్రంపై తాము చేస్తున్న పోరాటానికి జాతీయ మీడియాలో అంతగా ప్రాచుర్యం లభించడం లేదనే భావన టీఆర్ఎస్ వర్గాల్లో ఉందని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి కేసీఆర్ మీడియా సమావేశానికి జాతీయ మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారని తెలుస్తోంది.

    Telangana: ఏపీలో బాటలో తెలంగాణ.. అందుకోసం రూ. రూ. 7289 కోట్ల కేటాయింపు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

    KCR-YS Jagan: కేసీఆర్ ప్లాన్‌కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఉంటుందా ?.. దూరంగానే ఉంటారా ?

    ఇటీవల కేసీఆర్ పలువురు నేతలతో జరుపుతున్న సమావేశాల నేపథ్యంలో ఆయన కూడా ఈ ఏదో ఆసక్తికరమైన ప్రకటన లేదా వ్యాఖ్యలు చేస్తారని చాలామంది భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం చివరి నిమిషంలో మీడియా సమావేశం రద్దు చేసుకున్నారు. మొత్తానికి కేంద్రం, బీజేపీపై టీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉంటే.. కచ్చితంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసి ఉండేవారేమోననే టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు