Home /News /politics /

K Chandrashekar Rao: హుజూరాబాద్‌పై తేల్చేసిన సీఎం కేసీఆర్.. బీజేపీ కూడా అంతేనా ?

K Chandrashekar Rao: హుజూరాబాద్‌పై తేల్చేసిన సీఎం కేసీఆర్.. బీజేపీ కూడా అంతేనా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

K Chandrashekar Rao: నిజానికి సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు అక్కడ కచ్చితంగా ప్రచార సభ ఏర్పాటు చేస్తారని.. కేసీఆర్ సభతో టీఆర్ఎస్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి.

    తెలంగాణలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అందులోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. బీజేపీ తరపున మాజీమంత్రి ఈటల రాజేందర్ (Etela Rajendar) బరిలో ఉండటం, టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు స్వయంగా హుజూరాబాద్‌(Huzurabad) లో ఉంటూ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుండటంతో.. ఈ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. అయితే ఈ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వస్తారా ? లేదా ? అనే అంశంపై కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది. ఎన్నిక ప్రచారం ముగియడానికి ఒకటి రెండు రోజుల ముందు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజవకర్గం లేదా చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రచార సభలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.

    అయితే తాజాగా ఈ అంశంపై సీఎం కేసీఆర్ (CM KCR) స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నేడు జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత.. తనను హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేశారని విమర్శించారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటివి సరికాదని అన్నారు. దళితబంధు పథకం హుజూరాబాద్‌లో తాత్కాలికంగా ఆగిపోవచ్చని.. కానీ నవంబర్ 4 తరువాత అక్కడ ఈ పథకం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్లీనరీ వేదికగా స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే అంశాన్ని ప్లీనరీలో ప్రస్తావించడం ద్వారా తాను ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ తేల్చేశారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

    నిజానికి సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు అక్కడ కచ్చితంగా ప్రచార సభ ఏర్పాటు చేస్తారని.. కేసీఆర్ సభతో టీఆర్ఎస్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కేసీఆర్ మాత్రం ఇక్కడ ప్రచారం చేయడం లేదని సంకేతాలు ఇచ్చారు. అయితే అక్కడ పార్టీ పరిస్థితిని, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్ రావుతో పాటు ఇతర మంత్రులకు సూచనలు చేస్తున్న సీఎం కేసీఆర్.. హుజూరాబాద్‌లో గెలుపుపై ధీమాగానే ఉన్నారని తెలుస్తోంది.

    Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

    After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

    మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయకపోతే.. బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యంగా అమిత్ షా, నడ్డా వంటి నేతల ప్రచారం కూడా అక్కడ ఉండే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే.. ఇక హుజూరాబాద్‌లో ప్రచారం పర్వం బీజేపీ తరపున అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు అన్నట్టుగానే సాగనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ తరపున హుజూరాబాద్‌లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. మరికొన్ని చోట్ల ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు