హోమ్ /వార్తలు /politics /

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR-KTR: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసిన తరువాత ప్రభుత్వంలో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే చర్చ మొదలైంది.

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌లో కేసీఆర్ (KCR) తరువాత స్థానం ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ అంశంపై పార్టీలోనూ ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవనే చెప్పాలి. మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేటీఆర్‌ (KTR) ఒక దశలో ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. కొన్ని రోజుల పాటు ఈ రకమైన ప్రచారం జరగడం.. మొదట్లో దీన్ని కేసీఆర్, కేటీఆర్ ఖండించకపోవడంతో.. కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగడం దాదాపుగా ఖాయమని చాలామంది భావించారు.

మంత్రులు, పార్టీలోని ముఖ్యనేతలు సైతం కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరడంతో.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఈ ప్రచారానికి బ్రేక్ పడింది. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని కేసీఆర్ పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వడంతో... కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసిన తరువాత ప్రభుత్వంలో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే చర్చ మొదలైంది.

ఈలోపే ఇటీవల జరిగిన టీఆర్ఎస్ (TRS) ప్లీనరీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్లీనరీలో పలు తీర్మానాలు ఆమోదించారు. అందులో పార్టీ బైలాస్ లో పలు సంస్కరణలకు ప్లీనరీ ఆమోదం తెలిపింది. పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే… వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా మార్పు చేస్తూ తీర్మానం చేసింది ప్లీనరీ.

రాష్ట్ర కార్యవర్గ గాన్ని, జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు కు అధికారం రాష్ట్ర అధ్యక్షుడు ఉండేలా బైలాస్ సవరణలు చేసింది టీఆర్ఎస్ ప్లీనరీ. ఈ కొత్త నిబంధనల ప్రకారం కేసీఆర్ సైలెంట్ అయితే.. ఇక టీఆర్ఎస్‌లో కీలక నిర్ణయాలన్నీ కేటీఆరే తీసుకుంటారని అర్థమవుతోంది. త్వరలోనే టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం విషయంలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి.

Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ఎంపిక విషయంలో పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్ కాగా.. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం.. పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. దీంతో సీఎం కేసీఆర్ పార్టీ విషయంలో కుమారుడు కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చారని.. ఒకరకంగా పార్టీకి కూడా తన తరువాత కేటీఆరే సుప్రీం అని క్లారిటీ ఇచ్చారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.

First published:

Tags: CM KCR, KTR, Telangana

ఉత్తమ కథలు