Home /News /politics /

TELANGANA CLP MERGED IN TRS HERE IS THE DETAILS OF PARTIES NUMBERS IN ASSEMBLY SK

సెంచరీ దాటిన టీఆర్ఎస్...అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇవే

తెలంగాణ రాష్ట్రం (ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ రాష్ట్రం (ప్రతీకాత్మక చిత్రం)

అధికార పార్టీ బలం 103 చేరింది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 6కు పడిపోయింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ సీటు ఖాళీ అయింది.

    టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం కావడంతో తెలంగాణ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు మారిపోయాయి. గులాబీ టీమ్ సెంచరీ దాటేయగా.. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయి పూరతిగా డీలా పడింది. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా 88 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2 బీజేపీ 1, ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు. ఐతే టీఆర్ఎస్‌లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఒక టీడీపీ ఎమ్మెల్యే చేరారు. దాంతో అధికార పార్టీ బలం 103 చేరింది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 6కు పడిపోయింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ సీటు ఖాళీ అయింది.

    తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలు
    టీఆర్ఎస్-103
    ఎంఐఎం -07
    కాంగ్రెస్ -06
    టీడీపీ -01
    బీజేపీ -01
    ఖాళీలు -01 (హుజూర్ నగర్)
    మొత్తం 119

    టీఆర్ఎస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
    1.కాంతారావు(పికపాక)
    2.ఆత్రం సక్కు(అసిఫాబాద్)
    3.చిరుమర్తి లింగయ్య(నకిరేకల్)
    4.బానోతు హరి ప్రియ(ఇల్లందు)
    5.సబితా రెడ్డి(మహేశ్వరం)
    6.కందాల ఉపేందర్ రెడ్డి(పాడేరు)
    7.సుదీర్ రెడ్డి(ఎల్బీ నగర్)
    8.వనమా వెంకటేశ్వరరావు(కొత్తగూడెం)
    9.హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్)
    10.గండ్ర వెంకట్రమణా రెడ్డి(భూపాలపల్లి)
    11.జాజుల నరేందర్ రెడ్డి(ఎల్లా రెడ్డి)
    12.పైలట్ రోహిత్ రెడ్డి(తాండూరు)

    కారెక్కిన సైకిల్ పార్టీ నేతలు
    1. సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి)

    గులాబీ గూటికి చేరిన స్వతంత్రులు
    1. రాములు నాయక్ (వైరా)
    2. కోరుకంటి చందర్ (రామగుండం)

    కాంగ్రెస్‌లో మిగిలిన ఎమ్మెల్యేలు
    1.మల్లు భట్టి విక్రమార్క(మధిర)
    2.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(మునుగోడు)
    3.శ్రీధర్ బాబు(మంథని)
    4.జగ్గారెడ్డి(సంగారెడ్డి)
    5.సీతక్క(ములుగు)
    6.పొదెం వీరయ్య(భద్రాచలం)

    టీడీపీలో మిగిలిన సభ్యులు
    1. మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట)
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, CM KCR, MIM, Telangana, Telangana Assembly, Trs, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు