Home /News /politics /

TELANGANA CLP MERGED IN TRS ASSEMBLY SECRETARIAT RELEASES NOTIFICATION SK

కాంగ్రెస్‌కు బిగ్ షాక్...టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం సంపూర్ణం

కాంగ్రెస్, టీఆర్ఎస్

కాంగ్రెస్, టీఆర్ఎస్

12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ బలం 6కు పడిపోయింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది.

    తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ సంపూర్ణమయింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియెట్ నోటిఫికేషన్ జారీచేసింది. సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని గురువారం ఉదయం 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిశారు. వారి వినతి మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.  కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీచేశారు.

    12 మంది  ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ బలం 6కు పడిపోయింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించింది. ఇక టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో అధికార టీఆర్ఎస్ పార్టీ బలం 103కు చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి, వీరయ్య మాత్రమే మిగిలారు.  ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ సీటు ఖాళీ అయ్యింది.

    టీఆర్ఎస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
    1.కాంతారావు(పికపాక)
    2.ఆత్రం సక్కు(అసిఫాబాద్)
    3.చిరుమర్తి లింగయ్య(నకిరేకల్)
    4.బానోతు హరి ప్రియ(ఇల్లందు)
    5.సబితా రెడ్డి(మహేశ్వరం)
    6.కందాల ఉపేందర్ రెడ్డి(పాడేరు)
    7.సుదీర్ రెడ్డి(ఎల్బీ నగర్)
    8.వనమా వెంకటేశ్వరరావు(కొత్తగూడెం)
    9.హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్)
    10.గండ్ర వెంకట్రమణా రెడ్డి(భూపాలపల్లి)
    11.జాజుల నరేందర్ రెడ్డి(ఎల్లా రెడ్డి)
    12.పైలట్ రోహిత్ రెడ్డి(తాండూరు)





    నోటిఫికేషన్
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Congress, Telangana, Trs, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు