కాళేశ్వరం ప్రారంభోత్సవంలోనూ సీఎం కేసీఆర్ సెంటిమెంట్.. అదేంటంటే..

Telangana CM KCR Sentiment: కాళేశ్వర ప్రారంభోత్సవానికి కూడా అదే ‘6’ సెంటిమెంటును కొనసాగిస్తున్నారు. ఇప్పటికి ఐదు సార్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. ఆరవ సారి అడుగుపెట్టి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 20, 2019, 9:03 PM IST
కాళేశ్వరం ప్రారంభోత్సవంలోనూ సీఎం కేసీఆర్ సెంటిమెంట్.. అదేంటంటే..
సీఎం కేసీఆర్ (File)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 20, 2019, 9:03 PM IST
సీఎం కేసీఆర్ చేసే ప్రతి పనిలో సెంటిమెంటు చూస్తారు. ఏ చిన్న పనైనా.. ఎంత పెద్ద కార్యమైనా సరే.. తన లక్కీ నంబరు "6" కలిసేలా ఉంటేనే ముందుకు కదులుతారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు గత అసెంబ్లీని రద్దు చేసింది.. సెప్టెంబరు 6న, కొత్త అసెంబ్లీ కొలువుదీరే సమయంలో ప్రొటెం స్పీకర్‌గా చేసిన ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అహ్మద్ ఖాన్ గెలిచింది.. 6 సార్లు, సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ఉండేది.. 6 కార్లు, ఆ కాన్వాయ్‌లో ఉండే కార్ల రిజిస్ట్రేషన్ నంబరు..6666. ఈ మొత్తం కూడితే 6. అయితే, ఇప్పుడు కాళేశ్వర ప్రారంభోత్సవానికి కూడా అదే ‘6’ సెంటిమెంటును కొనసాగిస్తున్నారు. ఇప్పటికి ఐదు సార్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. ఆరవ సారి అడుగుపెట్టి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయనున్నారు.

అంతేనా, కన్నెపల్లి పంపుహౌస్‌లో ఉంటే ఆరో నంబరు మోటరునే సీఎం స్విచ్ ఆన్ చేయనున్నారట. అలాగే, మేడిగడ్డ బరాజ్‌లోనూ ‘ఆరు’ లెక్క పక్కాగా ఉండేలా చూసుకున్నారట. అక్కడ మొత్తం 85గేట్లు ఉండగా.. వీటిలో 2, 3, 4, 5, 6 నంబర్‌ గేట్లను ఎత్తి ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ గేట్లలో కూడా.. ఆరో నంబరు గేటును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్‌, సీఎం తొలుత మేడిగడ్డ వద్దకు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆరు హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. ఇలా సీఎం కేసీఆర్ సెంటిమెంటు పుణ్యమా అని ‘6’ కూడా అదృష్టం చేసుకుంది.

First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...