18న తెలంగాణ కేబినెట్... చర్చించే కీలక అంశాలు ఇవీ...

Telangana Cabinet : ఇన్నాళ్లూ ఎన్నికలు, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కీలక అంశాలపై దృష్టిసారించలేకపోయిన తెలంగాణ ప్రభుత్వం... కేబినెట్ సమావేశంతో వేగంగా అడుగులు వెయ్యబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 16, 2019, 8:46 AM IST
18న తెలంగాణ కేబినెట్... చర్చించే కీలక అంశాలు ఇవీ...
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్( ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కొత్త రెవెన్యూ, రెవెన్యూ శాఖల విలీనం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలు, జడ్పీల కొత్త పాలక వర్గాలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల్ని జూలై, ఆగస్టుల్లో ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కేబినెట్‌ చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో రాష్ట్ర్ర కేబినెట్ భేటీ జరిగింది. తర్వాత వరుసగా ఎన్నికలు రావడంతో మంత్రివర్గం సమావేశం కాలేదు. ఇక ఎన్నికలు ముగియడంతో జూన్ 18న జరిగే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది.

ఇక 21న ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ అంశంపై తెలంగాణ కేబినెట్‌లో ప్రధానంగా చర్చించబోతున్నారు. సాగు నీటికి సంబంధించి కేసీఆర్ కొన్ని ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. రాష్ట్ర్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు అంశాల్ని కేబినెట్ ఆమోదించనుంది. అలాగే తెలంగాణలో నూతన పురపాలక చట్టంపై చర్చించడంతోపాటు రెవెన్యు శాఖలోని సంస్కరణలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చిస్తారని తెలిసింది.

రైతులకు ప్రకటించిన లక్ష రుపాయల రుణమాఫీ ఎప్పుడెప్పుడు ఎలా మంజూరు చెయ్యాలనే అంశంపై విధివిధానాల్ని మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చెయ్యబోతున్నారు. ఇక ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న సెక్రటేరియట్ నిర్మాణంపైనా చర్చిస్తారని తెలిసింది.

 ఇవి కూడా చదవండి :

కాంగ్రెస్‌కు షాక్... బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

Viral Video : 103వ అంతస్థులో కాళ్ల కింద గ్లాస్ డెక్ పగిలింది... టెన్షన్... టెన్షన్...
First published: June 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు