Telangana: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. 13న అసెంబ్లీ సమావేశం

అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేయాల్సి ఉంది. ఇందుకోసం శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది

news18-telugu
Updated: October 9, 2020, 12:11 PM IST
Telangana: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. 13న అసెంబ్లీ సమావేశం
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ, 14న ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. 13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశ పెడతారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే అసెంబ్లీని సమావేశ పర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేయాల్సి ఉంది. ఇందుకోసం శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.

సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 16 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీఆర్వో వ్యవస్థతో పాటు రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భూముల రిజిస్ట్రేషన్ సరళతరం చేసేందుకు కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తున్నామని..99.9 శాతం భూముల సమస్యలకు అదే పరిష్కారం చూపిస్తుందని వెల్లడించింది.

కాగా, వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 28 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో 16 వరకే పరిమితం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోగ్యం దృష్ట్యాల 12 రోజులు ముందే ముగించారు. ఇక డిసెంబర్ చివరివారంలో హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఒకవేళ షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ కారణగా చట్టాలు చేయడానికి వీలు కాదు. ఈ క్రమంలో ఆ లోపే పలు కీలకమైన చట్టాలను ఆమోదింపజేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశపరుస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2020, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading