12న లేదా 15న తెలంగాణ కేబినెట్ సమావేశం... ఏం చర్చిస్తారంటే...

Telangana Cabinet : రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై... దాదాపు ఆరు నెలలవుతోంది. ఈసారి జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 12:03 PM IST
12న లేదా 15న తెలంగాణ కేబినెట్ సమావేశం... ఏం చర్చిస్తారంటే...
సీఎం కేసీఆర్ (File)
  • Share this:
బుధవారం లేదా... శనివారం నాడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్... కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే కొన్ని ముఖ్యమైన అంశాలపై లోతుగా చర్చ జరగబోతోంది. ప్రధానంగా... ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్... పంపులను ఆన్‌ చేసి నీటి లిఫ్టింగును ప్రారంభించనున్నారు. ఇందుకోసం మేడిగడ్డ పంప్‌హౌజ్‌ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కేబినెట్‌ సమావేశంలో చర్చించబోతున్నారు. అలాగే... సీఎం కేసీఆర్... ఈ నెల 14న ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక కేసీఆర్ ఆయన్ని కలవలేదు. వేర్వేరు కారణాల వల్ల ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లలేకపోయారు. 14న నాటి పర్యటనలో ప్రధానిని కలిసి శుభాకాంక్షలు చెప్పనున్నారు.

ఈ నెల 17న కొత్త బీసీ గురుకులాల ప్రారంభోత్సవం జరగబోతోంది. అలాగే... ఈ నెల 27 లోపు కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చెయ్యనున్నారు. ఈలోగా... ఏపీ అధీనంలో ఉన్న భవనాల్ని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అప్పగించబోతోంది. ఇందుకోసం సోమవారం రెండు రాష్ట్రాల అధికారులూ సమావేశమై చర్చించారు. ప్రస్తుతం సచివాలయంలోని J బ్లాకును ఖాళీ చేయించే పనిలో ఉన్నారు ఏపీ అధికారులు. కంప్యూటర్లు, ఫర్నిచర్‌, ఇతర విలువైన సామగ్రిని ఏపీకి తరలిస్తున్నారు.

ఈనెల 16 కల్లా... భవనాలను ఖాళీ చేసే ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏ శాఖకు ఏ బ్లాక్‌ను కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశాలన్నింటిపైనా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

కాస్త నవ్వండన్నా... మంత్రులతో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

న్యూయార్క్ మాన్‌హట్టన్ భవనంపై హెలికాప్టర్ ప్రమాదం... పైలట్ మృతికదిలే కారులోంచి భార్యను తోసేసిన భర్త... ఆమె చేసిన తప్పేంటి?
First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading