కేసీఆర్ కేబినెట్‌లో ఈ ఆరుగురికి చోటు దక్కే ఛాన్స్

Telangana Cabinet | ఈసారి కేబినెట్ విస్తరణలో కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరికీ చోటు దక్కుతుందా? లేకపోతే ఏమైనా సంచలనాలు ఉంటాయా?

news18-telugu
Updated: September 7, 2019, 11:05 PM IST
కేసీఆర్ కేబినెట్‌లో ఈ ఆరుగురికి చోటు దక్కే ఛాన్స్
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండోసారి కేబినెట్‌ను విస్తరిస్తున్నారు. తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం 12 మంది (ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిపి) ఉన్నారు. మరో ఆరుగురికి బెర్త్‌లు ఖాళీ ఉన్నాయి. ఆ ఆరుగురు ఎవరై ఉంటానే చర్చ మొదలైంది. అయితే, ప్రస్తుతం ఉన్న సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కరీంనగర్ జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే గుంగుల కమలాకర్ రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మీద విజయం సాధించిన నరేందర్ రెడ్డి లేదా ఆయన సోదరుడు మహేందర్ రెడ్డిల్లో ఒకరికి స్థానం దక్కే అవకాశం ఉందంటున్నారు. నల్లగొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డికి బెర్త్ ఖాయమని సమాచారం.

కేసీఆర్ కేబినెట్‌లో మహిళా మంత్రులు లేకపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. దీంతో ఇద్దరు మహిళా మంత్రులకు ఈ సారి అవకాశం కల్పిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఆ బెర్త్‌లు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి నెలకొంది. మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సబితా ఇంద్రారెడ్డికి కచ్చితంగా చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. ఆమెతోపాటు రేఖానాయక్‌ మరో మహిళా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే చాన్స్ ఉంది. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కచ్చితంగా చోటు దక్కకపోవచ్చు. ఇవాళ ఉదయం ప్రగతిభవన్‌కు వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డిని భద్రతా సిబ్బంది వెనక్కి పంపేశారు. దీంతో ఆమెకు మంత్రి పదవి దక్కడం డౌటే.

తెలంగాణ కేబినెట్‌ను విస్తరిస్తున్నారనే వార్త బయటకు రాగానే హరీశ్ రావుకు మంత్రిపదవి వస్తుందా? రాదా? అనే ప్రశ్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో వినిపిస్తోంది. అయితే, హరీశ్ రావుకు కూడా కేబినెట్ బెర్త్ ఖాయమైందని ప్రగతిభవన్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ కాచుకుని కూర్చుంది. కాంగ్రెస్ కూడా ఒక్క ఛాన్స్ దొరికితే దూసుకెళ్దామని భావిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలోనే అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో హరీశ్ రావును పక్కన పెట్టడం ద్వారా కేసీఆర్ రిస్క్ తీసుకుంటారా? లేదా? చూడాలి.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading