Telangana Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ముహూర్తం టైమ్ ఫిక్స్..

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైన తమిళసై సౌందర్ రాజన్ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియచేశారు.

news18-telugu
Updated: September 8, 2019, 3:38 AM IST
Telangana Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ముహూర్తం టైమ్ ఫిక్స్..
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కేసీఆర్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 8, 2019, 3:38 AM IST
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో, నేటి సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైనన తమిళసై సౌందర్ రాజన్ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియచేశారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్ పదవీకాలం ముగిసింది. నేటి ఉదయం తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కొత్త మంత్రులతో ఆమె ప్రమాణస్వీకారం చేయిస్తారు.

2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తొలిసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఫిబ్రవరి 19న మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు కేసీఆర్. ఈసారి ఎంతమందికి అవకాశం కల్పిస్తారని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

గతంలో కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగేవి. కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఊహాగానాలు కూడా జరిగేవి. దీంతోపాటు ఆశావహుల పైరవీలు, చివరి ప్రయత్నాలు కూడా ఉండేవి. అయితే, ఈ సారి కేసీఆర్ ఊహించని ఎత్తు వేశారు. కొత్త గవర్నర్ వస్తున్న రోజే కొత్తగా కేబినెట్‌ను విస్తరించనున్నారు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...