Telangana Cabinet | తెలంగాణలో కొత్తమంత్రుల ప్రమాణస్వీకారం..

Telangana Cabinet | తెలంగాణ రాజ్‌భవన్‌లో కొత్త గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

news18-telugu
Updated: September 8, 2019, 4:24 PM IST
Telangana Cabinet | తెలంగాణలో కొత్తమంత్రుల ప్రమాణస్వీకారం..
హరీశ్ రావు, కేటీఆర్ (File)
news18-telugu
Updated: September 8, 2019, 4:24 PM IST
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. రెండోసారి విజయవంతంగా మరో ఆరుగురికి చోటుకల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా ప్రాధాన్యతను బేరీజు వేసుకున్న కేసీఆర్ వారికి అవకాశం కల్పించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో కొత్త గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

మొట్టమొదటగా మంత్రి హరీశ్ రావు ప్రమానస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం హరీశ్ రావు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేశారు.

హరీశ్ రావు తర్వాత కేటీఆర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేటీఆర్ పేరు పిలవగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పవిత్ర హృదయంతో ప్రమాణస్వీకారం చేశారు కేటీఆర్. ప్రమాణస్వీకారం తర్వాత కేటీఆర్ వెళ్లి సీఎం కేసీఆర్ కాళ్లకు దండం పెట్టారు.

కేటీఆర్ తర్వాత పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ ఎల్పీ విలీనం కావడంతో ఆమె టీఆర్ఎస్ సభ్యురాలిగా మారిపోయారు.



సబితా ఇంద్రారెడ్డి తర్వాత గంగుల కమలాకర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.

గంగుల కమలాకర్ తర్వాత సత్యవతి రాథోడ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆమె దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత సత్యవతి రాథోడ్ వెళ్లి సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.

సత్యవతి రాథోడ్ తర్వాత చివరగా పువ్వాడ అజయ్ మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.
Loading...
ఇప్పటికే కేసీఆర్‌తో కలిపి కేబినెట్‌లో 12 మంది ఉన్నారు. కొత్తగా మరో ఆరుగురు రావడంతో మంత్రుల సంఖ్య 18కి చేరింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.
First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...