తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...

ఈ నెల 24 నుంచి అన్ని పట్టణాలు, నగరాల్లో పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

news18-telugu
Updated: February 16, 2020, 11:03 PM IST
తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానంతో పాటు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం సంపాదించే మార్గాల మీద చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులు సరైన నిష్పత్తిలో దక్కడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను కూడా బేరీజు వేసుకుని రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీ పరిధిలోని భూములను విక్రయించాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే, భూముల మార్కెట్ విలువ పెంపు మీద కూడా చర్చించారు. ఉప్పల్ బగాయత్ తరహాలో హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మోకిల్లా, ప్రతాపసింగారం, మేడ్చల్ జిల్లా కొర్రెములలో వెంచర్లు వేసి ఆ భూములను విక్రయించడం ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయన్ని ఆర్జించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని తెలంగాణ రాష్ట్ర కేబెనెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన సిటిజెన్ షిప్ (అమెండ్మెంట్) యాక్టును ర్దదు చేయాలని కేబినెట్ కోరింది. ఈ మేరకు కేబినెట్ లో తీర్మానం చేశారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.


ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 18న ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రగతి నిర్వహణపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని ఆకాంక్షించారు.
  1. ఈ నెల 24 నుంచి అన్ని పట్టణాలు, నగరాల్లో పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి.

  2. పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలి. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలి. పట్టణ ప్రగతి మీద చర్చించాలి. 

  3. రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేనిరుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలి. రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని కేబినెట్ నిర్ణయించింది.
  4. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

  5. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు