Home /News /politics /

TELANGANA CABINET DECISION ON PADDY PROCUREMENT AND OMICRON CORONA VARIANT AK

Telangana Cabinet Decisions: రైతులకు షాక్.. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవన్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Telangana Cabinet: తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారంతో పాటు ఒమిక్రాన్ వైరస్ విషయంలో ఏ విధంగా అప్రమత్తతతో వ్యవహరించాలనే దానిపై మంత్రివర్గంలో చర్చించారు. ఈ క్రమంలో వచ్చే యాసంగి నుంచి వరి కొనుగోళ్లు చేపట్టే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
    కేంద్రం బాయిల్డ్ రైస్ కొనలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని ముందుగా చెబితే రైతులు వేరే పంట వేసుకుంటారని ఈ విషయం చెబుతున్నానని వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఎంతో కొట్లాడిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. యాసంగిలో రైతులు వరి పండించవద్దని స్పష్టం చేశారు. వర్షాకాలం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్న సీఎం కేసీఆర్.. వాటిని కేంద్రం కొనుగోలు చేయకపోతే ఢిల్లీలో తీసుకెళ్లి ప్రధాని ఇంటి ముందు, బీజేపీ ఆఫీసు ముందు పోస్తామని హెచ్చరించారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రైతులు సొంతంగా వరి వేసుకుంటామంటే తమకు ఇబ్బంది లేదని అన్నారు.

    కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అనే సామాజిక బాధ్యత నుంచి తప్పించుకుంటోందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరించకూడదని వ్యాఖ్యానించారు. తాము ఉప్పుడు బియ్యం తీసుకోమని కేంద్రమంత్రి అన్నారని.. భవిష్యత్తులో ఈ రకమైన బియ్యం ఇవ్వకూడదని షరతు మీద తమ దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రా రైస్ సంవత్సరానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటారనే దానిపై కూడా కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని విమర్శించారు.

    యాసంగిలో తెలంగాణలో పండేది కచ్చితంగా ఉప్పుడు బియ్యమే అని కేసీఆర్ తెలిపారు. అలాంటప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భరించాలని అన్నారు. రైతు నష్టపోకుండా ఉండేందుకు బాయిల్డ్ రైస్ విధానం వచ్చిందని తెలిపారు. ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని.. కాబట్టి రైతులకు పంట మార్పిడి తప్ప మరో మార్గం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో వ్యవసాయానికి అనువైన పరిస్థితులు కల్పించి.. పండిన ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వమని ఆయన వివరించారు.

    Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

    KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

    Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

    Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేసీఆర్ విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదని అనడాన్ని తప్పుబట్టారు. ఆయనకు దమ్ముంటే కేంద్రంతో వరి ధాన్యం కొనేలా చేయాలని డిమాండ్ చేశారు. అది చేయకుండా.. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకుని ప్రధాని మోదీ దేశ రైతులకు క్షమాపణ చెప్పారని కేసీఆర్ ఆరోపించారు. పలుసార్లు కేంద్రమంత్రి దగ్గరకు ఈ అంశంపై చర్చించేందుకు వెళితే.. మీకేమీ పనిలేదా ? అంటూ తమను అవమానపరిచారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ధాన్యం అధికంగా పండటంతో వాళ్ల కళ్లు మండుతున్నాయని కేసీఆర్ విమర్శించారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana, Telangana cabinet

    తదుపరి వార్తలు